సోమనాథ్
సృష్టి ప్రారంభం నుంచి కూడా పరమేశ్వరుడు తన లీలా విశేషాలను చాటుతూనే వస్తున్నాడనే విషయం పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పేర్లు వేరైనా ... ప్రాంతాలు వేరైనా ప్రాచీన నాగరికతలలో శివారాధన జరిగినట్టుగా అధారాలు కనిపిస్తున్నాయి. లింగ భాగముగా శివుడు ... పానపట్టముగా అమ్మవారు ఆదిదంపతుల ఏకరూపతకు అద్దం పడుతూ, పూజాభిషేకములు అందుకుంటున్నారు.
పరమశివుడు జ్యోతి స్వరూపంగా ... లింగరూపంలో వెలసిన క్షేత్రాలు 'జ్యోతిర్లింగాలు'గా అలరారుతున్నాయి. అలా ఆవిర్భవించిన 12 జ్యోతిర్లింగాలలో మొదటిదిగా ... అత్యంత శక్తి మంతమైనదిగా 'సోమనాథ జ్యోతిర్లింగం' చెప్పబడుతోంది. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణంలో వెలసింది. ఈ క్షేత్ర ఆవిర్భ వానికి కారణమైన కథ ఒకటి మనకు స్కాందపురాణంలో కనిపిస్తుంది.
దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వారిలో ఒక్క 'రోహిణి'ని మాత్రమే ప్రేమిస్తూ మిగతా వారికి చంద్రుడు దూరంగా ఉంటుంటాడు. ఈ విషయంగా వాళ్లు తమ తండ్రి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తారు. దాంతో అందగాడినని మిడిసి పడుతోన్న చంద్రుడు కుష్టు వ్యాధి గ్రస్తుడు కావాలంటూ దక్ష ప్రజాపతి శపిస్తాడు.
ఈ శాపం నుంచి విముక్తి పొందడానికి చంద్రుడు ... శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివానుగ్రహం కారణంగా వ్యాధి తగ్గుతుంది ... కాకపోతే కృష్ణ పక్షమున రోజు రోజుకీ చంద్రకళ తగ్గుతుందనీ, శుక్ల పక్షమున రోజురోజుకీ చంద్రకళ పెరుగుతుందని శివుడు చెబుతాడు. చంద్రుడికి సోముడు అనే పేరు కూడా వుంది ... శాపవిమోచనమైన కారణంగా ఆయన ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం ... సోమనాథుడిగా ... ఈ క్షేత్రం సోమనాథంగా వెలుగొందుతోంది.
పూర్వం అత్యంత సిరిసంపదలతో విలసిల్లిన ఈ క్షేత్రం ... ఎన్నోసార్లు మతపరమైన దాడులను ఎదుర్కుంటూ వచ్చింది. ఈ స్వామిని దర్శించినంతనే చర్మ వ్యాధులు నశిస్తాయనీ ... పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయనే భక్తుల విశ్వాసం నేటికీ చెక్కుచెదరలేదు.