భక్తి - ముక్తి
విష్ణుమూర్తి అలంకారప్రియుడు ... శివుడు అభిషేక ప్రియుడు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి విష్ణాలయానికి వెళుతున్నప్పుడు స్వామివారికి ఇష్టమైన పువ్వులను తీసుకు వెళ్లి సమర్పించాలి. అలాగే శివాలయానికి వెళుతున్నప్పుడు అభిషేక ద్రవ్యాలను తీసుకుని వెళ్లాలి. అలా వారి మనసు గెలుచుకుని అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం వుంటుంది. ఇక విష్ణాలయంలోను ... శివాలయంలోను దీపాలు వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ఈ విధంగా చేయడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి.
ఇక ఈ దీపారాధనలోకి ఆవునెయ్యిని ఉపయోగించడం వలన మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సమయానికి అది అందుబాటులో లేని పక్షంలో ఆ ప్రయత్నాన్ని మానుకోకూడదు. నువ్వుల నూనె ... అవిసె నూనె ... ఇప్పనూనెతో గాని దీపారాధన చేయవచ్చు. నియమబద్ధంగా పూజలు చేయడమే కాకుండా, అందుకు తగిన భక్తి మనసు నిండుగా ఉన్నప్పుడే దైవానుగ్రహానికి కావలసిన అర్హతను సంపాదించుకోగలుగుతామనే విషయాన్ని మరిచిపోకూడదు.