వినాయక నిమజ్జనం
పండుగ అంటేనే సందడి ... సంబరం ... ఆనందం ... అనుభూతి. అయితే మిగతా పండుగలకి ... వినాయక చవితికి మధ్య తేడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సాధారణంగా తాము తలపెట్టిన ఏ కార్యక్రమానికైనా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడిని పూజిస్తూ వుంటారు. ఇక ఈ రోజున ఇంట్లో జరిగే పూజల సంగతి అటుంచితే, యువకులంతా ఓ బృందంగా ఏర్పడి వీధి వీధిన మంటపాలు ఏర్పాటు చేస్తారు. మట్టితో తయారు చేయబడిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత వినాయకుడిని వైభవంగా ఊరేగిస్తూ తీసుకువెళ్లి చెరువుల్లో గానీ ... నదుల్లో గాని నిమజ్జనం చేస్తుంటారు. ఇంట్లో పూజ నిమిత్తం తెచ్చిన మట్టి విగ్రహాలను కూడా దగ్గరలోని నీటి ప్రవాహాల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఈ విధంగా నిమజ్జనం చేయడమనే ఆచారం వెనుక సరైన అర్థం లేకపోలేదు.
యంత్ర ప్రతిష్ఠ కాకపోవడం వలన ... నిత్య పూజలు సాధ్యపడనందున నిమజ్జనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఎక్కువ రోజులపాటు విగ్రహాన్ని అలాగే ఉంచితే దాని రూపురేఖలు మారిపోతాయి. దానిని దోషంగా భావించిన ప్రాచీనులు విగ్రహాలను నిమజ్జనం చేయాలనే చెప్పారు. మన్ను అనేది నీటి నుంచి వచ్చినది కాబట్టి మన్నుతో చేయబడిన విగ్రహాన్ని తిరిగి నీటిలో కలపడమే మంచిదంటూ వారు వివరించారు.
ఎంతో వైభవంగా పూజలను అందుకున్న వినాయకుడి విగ్రహం నీటిలో వదలగానే రూపురేఖలు కోల్పోయి ఆ నీటిలో కలిసిపోతుంది. జీవులందరూ ఎంతటి వైభవంతమైన జీవితాన్ని చూసినా, చివరికి ఆ పరమాత్మలో లీనంకాక తప్పదనే తత్వాన్ని చాటిచెప్పడమే ఈ నిమజ్జన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమనేది పెద్దల మాట.