ఆలయ శిఖరం
ఆలయానికి ప్రధాన ముఖ ద్వారంగా ఎత్తైన గోపురం వుంటుంది. సాధారణంగా ఈ గోపురాలు అయిదు ... ఏడు ... తొమ్మిది అంతస్తులను కలిగి వుంటాయి. ఈ అంతస్తులకు చేరుకోవడానికి మెట్లదారి కూడా ఉంటుంది. ఇక ఈ గోపురం నిర్మాణం పట్ల ప్రాచీనకాలం నాటి రాజులు ప్రత్యేక శ్రద్ధను చూపేవారు. ఈ కారణంగానే ఆనాటి శిల్పకళా వైభవానికి గోపురాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
గోపురం చూడగానే అది వైష్ణవ ఆలయమా ... శివాలయమా అనేది కూడా తెలిసిపోతుంది. వైష్ణవ ఆలయ గోపురాలపై శంఖు చక్రాలు ... గరుత్మంతుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక శివాలయపు గోపురంపై త్రిశూలం ... నందీశ్వరుడి ప్రతిమలు కనిపిస్తూ వుంటాయి. దేవాలయంలో గర్భాలయాన్ని 'తల'గా ... అంతరాళ మంటపాన్ని హృదయంగా ... ముఖ మంటపాన్ని నాభి ప్రదేశంగా ... గోపురాన్ని పాదాలుగా భావిస్తుంటారు.
గర్భాలయంలోని మూల విరాట్టును దర్శించుకోలేనప్పుడు, దూరం నుంచి గోపురానికి నమస్కరించవచ్చు. ఈ విధంగా చేయడం వలన భగవంతుడి పాదాలకు నమస్కరించిన ఫలితం దక్కుతుంది. అంతే కాకుండా ఉదయాన్నే గ్రామస్తులు నిద్రలేవగానే ఈ గోపురాన్ని చూసి నమస్కరించుకోవచ్చు. గంభీరంగా ... అభయమిస్తున్నట్టుగా వుండే గోపురం భక్తులకు భరోసా ఇస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది.
ఇక ప్రాచీనకాలంలో గోపురాలు ఎత్తుగా నిర్మించడమే కాకుండా, ఆలయాలు కూడా సాధ్యమైనంత ఎత్తులో నిర్మించేవారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ఏ ఊరి దేవాలయం ఆ ఊరివారికి ఆశ్రయంగా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. గోపురద్వారం గుండా లోపలికి వెళ్లడం వలన ముందుగా స్వామివారి పాదాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుంది.