షోడశోపచారాలు

షోడశోపచారాలు
'షోడశోపచారాలు' అనగా 16 రకముల ఉపచారాలు అని అర్థం. మన ఇంటికి ముఖ్యమైన అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఎంతగా గౌరవించి ఎలాంటి మర్యాదలు చేస్తామో, అలాగే శక్తిని ... భుక్తిని ... ముక్తిని ప్రసాదించే ఆ దైవం పట్ల కూడా భక్తి శ్రద్ధలు కలిగి వుండాలని పెద్దలు చెబుతుంటారు. దైవం మనసు గెలుచుకోవడానికి ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి 16 రకాల ఉపచారాలను పాటించాలని శాస్త్రం చెబుతోంది.

ఆవాహనము .. ఆసనము .. పాద్యము .. అర్ఘ్యం .. ఆచమనీయం .. స్నానం .. వస్త్రం .. యజ్ఞోపవీతం .. గంధం .. పుష్పం .. ధూపం .. దీపం .. నైవేద్యం .. తాంబూలం .. నమస్కారం .. ప్రదక్షిణం .. ఇలా 16 రకాలైన పూజాంగములతో దైవాన్ని సంతృప్తి పరచవలసి వుంటుంది. పవిత్రమైన ప్రదేశంలో ... నిర్మలమైన మనసుతో 16 ఉపచారాలతో దైవాన్ని పూజించినట్టయితే అనంతమైన పుణ్య ఫలాలను అందుకోవచ్చును.
Get the ap7am app Free · Opens in one tap Install

More Bhakti Articles