మాఘ స్నానం

మాఘ స్నానం
మాఘ మాసం ఎంతో ఉత్తమమైనది ... మరెంతో పవిత్రమైనది. ఈ మాసంలో చేసే పూజలకు ... స్నానాలకు అనంతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే మాఘ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా పెట్టుకుంటూ వుంటారు. ఈ మాఘ మాసంలో దేవాది దేవతలు సైతం త్రివేణి సంగమ స్నానం ఆచరిస్తూ వుంటారు.

మాఘమాసంలో చేసిన పూజలు ... స్నానాలు ఆపదల బారిన పడకుండా కాపాడతాయనీ, మాఘ స్నానం కారణంగా మహా విష్ణువు అనుగ్రహం త్వరగా లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో బెల్లం ... తిలలు దానం చేయడం వలన ఆరోగ్యం ... ఆయుష్షు వృద్ధి చెందుతాయని 'భ్రుగు మహర్షి' చెప్పాడు. మాఘమాసంలో ఆచరించిన పూజాది కార్యక్రమాల వల్లనే, అరుంధతి ... రోహిణి ... శచీదేవి ... తిలోత్తమ ఉత్తమ ఫలితాలను పొందినట్టు శాస్త్రాలు ప్రస్తావిస్తున్నాయి.

More Bhakti Articles