పూర్వజన్మ సుకృతం
నిత్య జీవితంలో చాలామంది తాము ఎవరికీ ఎలాంటి హాని చేయలేదనీ, ఎవరికీ అన్యాయం చేయలేదని, అయినా దేవుడు తమని చిన్నచూపు చూస్తున్నాడని అనుకుంటూ వుంటారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ అందరితో మంచివారని అనిపించుకుంటున్నా, పుణ్యక్షేత్రాలు చుట్టివస్తున్నా దేవుడు మాత్రం తమని కరుణించడం లేదని బాధ పడుతుంటారు.
రాక్షస ప్రవృత్తిని కలిగినవారు ... దుర్మార్గులుగా చెలామణి అవుతున్నవారు సిరి సంపదలతో మునిగితేలుతుండటం మంచివారికి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్లు 'కలికాలం' అనుకుంటూ నిరాశ చెందుతుంటారు.
అయితే ప్రస్తుతం చెడు దారిలో నడిచేవారు అనుభవిస్తున్న సుఖ సంపదలకు కారణం, క్రితం జన్మలో వాళ్లు పుణ్య కార్యాలు చేసి ఉండటమేనని 'పద్మ పురాణం' చెబుతోంది. ఈ జన్మలో చెడు మార్గంలో ప్రయాణిస్తూ వాళ్లు వచ్చే జన్మను దుర్భరం చేసుకుంటున్నారని భావించాలి.
క్రితం జన్మలో తల్లిదండ్రులను ప్రేమించని వారు ... దైవ కార్యాలు చేయని వారు ... దానధర్మాలు చేయనివారు ఈ జన్మలో సిరిసంపదలకు ... సుఖ సంతోషాలకు దూరమవుతారనే విషయం పద్మపురాణంలో కనిపిస్తుంది. కాబట్టి దైవం ప్రసాదించిన ఈ జన్మను ఏ మాత్రం అవకాశం దొరికినా దానిని సార్ధకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే కావలసిన వరాలు కోరకుండానే కొలువుదీరతాయి ... జీవితాన్ని అందంగా ఆనందమయం చేస్తాయి.