శ్రీ కృష్ణుడు - అష్ట భార్యలు

శ్రీ కృష్ణుడు - అష్ట భార్యలు
'రుక్మిణి'ని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని ఆమె సోదరుడు 'రుక్మి' ప్రయత్నిస్తుండగా, శ్రీ కృష్ణుడు ఆమెను అపహరించి రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. సత్రాజిత్తు అభ్యర్థన మేరకు 'సత్యభామ'ను ... జాంబవంతుడి కోరిక మేరకు 'జాంబవతి'ని పరిణయమాడాడు. 'కాళింది' కోరిక మేరకు ఆమెనీ ... మేనత్త శృతకీర్తి అభ్యర్థన మేరకు 'భద్ర'ను వివాహం చేసుకున్నాడు.

ఇక స్వయం వరంలో నాగ్న జిత్తుడి కుమార్తె అయిన 'నాగ్నజితి'ని ... అవంతీరాజు కుమార్తె అయిన 'మిత్రవింద'ను ... మద్ర దేశాధిపతి కూతురు 'లక్షణ'ను చేపట్టాడు. అలా శ్రీ కృష్ణుడి జీవితంలో అష్టభార్యలు ప్రవేశించారు. ఆ నీలమేఘ శ్యాముడు ఒకవైపున అష్ట భార్యలతో తులతూగుతూనే, మరో వైపున తనని నమ్ముకున్న భక్తులను అనుగ్రహించిన తీరు పురాణాలలో దర్శనమిస్తుంది.

More Bhakti Articles