ద్వాదశాదిత్యులు
ప్రత్యక్ష దైవమైన 'సూర్యనారాయణమూర్తి'కి 12 రూపాలు చెప్పబడ్డాయి. వీరినే 'ద్వాదశాదిత్యులు'అని అంటూ వుంటారు. సకల చరాచర సృష్టికి ఆధారమైన సూర్యుడి గురించి వేదాలన్నీ కూడా ఎలుగెత్తి చాటుతున్నాయి. చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించడమే కాకుండా, అనేక వ్యాధుల బారినుంచి జీవులను కాపాడి ఆరోగ్యాన్ని అందించే శక్తి సామర్థ్యాలు సూర్యుడు కలిగి వున్నాడు.
ఇతిహాసాలు ... పురాణాలు కూడా సూర్యుడి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రస్తావించాయి. ఆర్యముడు ... మిత్రుడు ... వరుణుడు ... అర్కుడు ... భగుడు ... ఇంద్రుడు ... వివస్వంతుడు ... పూషుడు ... పర్జన్యుడు ... త్వష్టా ... విష్ణువు ... అజుడు ద్వాదశాదిత్యులుగా పిలవబడుతున్నారు.
మన దేశంలో కోణార్క్ సూర్య దేవాలయం ప్రసిద్ధిచెందింది. 800 సంవత్సరాల క్రితమే నిర్మించబడిన ఈ ప్రాచీన ఆలయంలో సూర్యనారాయణమూర్తి 7 గుర్రాలు ... 12 చక్రాలుగల రథంపై దర్శనమిస్తాడు. ఇక మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్య దేవాలయం ప్రసిద్ధిచెందినది. ఇక్కడి మూలవిరాట్టును సూర్య కిరణాలు నేరుగా తాకడాన్ని గురించి విశేషంగా చెప్పుకుంటారు.