జమ్మిచెట్టు

జమ్మిచెట్టు
'జమ్మిచెట్టు' (శమీ వృక్షం)విజయదశమి రోజునే అందరికీ గుర్తుకు వస్తుంది. ఆ రోజున జమ్మి చెట్టును పూజించి ''శమీ శమీయతే పాపం ... శమీ శత్రు వినాశనం'' అనే శ్లోకం కూడా రాసి జమ్మిచెట్టుకు కడుతూవుంటాం. జమ్మిచెట్టుపై ఆయుధాలు దాచి ... దానిని పూజించిన కారణంగానే పాండవులు యుద్ధంలో గెలిచారని ఇతిహాసాలు చెబుతున్నాయి.

పురాణాలు జమ్మిచెట్టును 'అగ్ని వృక్షం'గా పేర్కొంటున్నాయి. యజ్ఞయాగాది క్రతువులకు అవసరమైన అగ్నిని రాజేసేందుకు ఈ చెట్టు వేళ్లను ... బెరడును ఉపయోగిస్తూ వుంటారు. అగ్ని వృక్షంగా అందరి ప్రశంసలు అందుకున్న జమ్మిచెట్టు, శత్రు సంహారం చేయడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే శత్రు సంహారానికి సిద్ధపడిన వాళ్లు ఈ చెట్టును పూజించి యుద్ధానికి వెళ్లేవారని తెలుస్తోంది.

ఇక ఈ చెట్టు విజయంతో పాటు సంపదలు ప్రసాదిస్తుందనే విశ్వాసం ప్రాచీనకాలం నుంచి వుంది. పూర్వం రాజులు తమ సంపద పెరగడం కోసం ... అది స్థిరంగా వుండటం కోసం జమ్మిచెట్టు కొమ్మలను గానీ ... ఆకులను గాని ఖజానాలో ఉంచేవారట. ఇదే సంప్రదాయం నేటికీ కనిపిస్తూ వుండటం విశేషం. విజయదశమి రోజున జమ్మి పూజ కాగానే ఆకులను దూయడం ... ఒకరికొకరు ఇచ్చుకోవడం ... తమ సంపదతో కలిపి భద్రపరుచుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

More Bhakti Articles