ఏకాక్షి నారికేళం

ఏకాక్షి నారికేళం
ప్రతి పూజలోను ప్రముఖ పాత్ర వహించే కొబ్బరికాయకు 'మూడు కన్నులు' వుండటం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో రెండు కన్నులున్న కొబ్బరికాయ కంటపడితే ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది ఒక కన్ను కలిగిన కొబ్బరికాయ కూడా ఉంటుందని తెలిసినప్పుడు మరింత ఆశ్చర్యం కలగడం సహజం. ఒకే కన్నుగల నారికేళాన్ని'ఏకాక్షి నారికేళం'అని అంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ కొబ్బరికాయ దొరకడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది.

లక్ష్మీదేవి పూజలో ఏకాక్షి నారికేళం ప్రాధాన పాత్ర పోషిస్తుంది ... దీనిని ఉపయోగిస్తూ పూజ చేయడం వలన ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని అంటారు. ఇక ఈ పూజ 'దీపావళి' రోజున చేసినట్టయితే అది మరింత విశేష ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తోంది. ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో వుంచడం వలన సుఖసంపదలు ... కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.

ఇక ఈ ఏకాక్షి నారికేళం ఇంట్లో ఉన్నంత వరకూ ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించలేవు. ఎవరైనా పిశాచ బాధలు పడుతున్నట్టయితే వారి ఒడిలో ఏకాక్షీ నారికేళాన్ని వుంచినట్టయితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. గర్భవతులైన స్త్రీలకు ఏకాక్షి నారికేళం వాసన చూపించడం వలన సుఖ ప్రసవం జరుగుతుందని అంటారు. సమస్త సమస్యల నుంచి విముక్తిని కలిగిస్తూ ... సంపదలను ప్రసాదించే మహిమాన్వితమైన ఏకాక్షి నారికేళం కోసం వెంటనే గాలించడం మొదలు పెట్టండి మరి.

More Bhakti Articles