నల్ల పసుపు కొమ్ము
ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక ఉపయోగముంది ... ప్రతి పదార్ధానికి ఒక ప్రయోజనముంది. కొన్ని వస్తువులు నిత్యవసరాల జాబితాలో చేరిపోతే, మరి కొన్ని ఆధ్యాత్మిక పథంలో మహిమాన్వితమై అడుగడుగునా మనల్ని పలకరిస్తుంటాయి. అలాంటి వాటిలో 'నల్ల పసుపుకొమ్ము'ఒకటి.
సాధారణ పసుపు కొమ్ము నుంచి వచ్చే పసుపు ఇటు సైన్స్ పరంగాను ... అటు శాస్త్ర పరంగాను తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక నల్ల పసుపు కొమ్ము'కి వున్న ప్రాధాన్యత గురించి తెలిసిన వారు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి.'నల్ల పసుపుకొమ్ము' ఎంతో మహిమాన్వితమైనది. ఆధునిక జీవితానికి అలవాటుపడిన కొందరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోక పోవచ్చు గానీ, ప్రాచీన కాలం నుంచి ఇది తన ప్రత్యేకతను చాటుతూనే వస్తోంది.
సాధారణ పసుపును మనం శుభకార్యాలలోను ... పండుగల సందర్భాల్లోనూ ... వంటకాల్లోనూ ఉపయోగిస్తుంటాం. ఇక ఈ నల్ల పసుపుకొమ్మును మాత్రం దుష్టగ్రహాల బారి నుంచి బయటపడటానికి వాడుతుంటారు. సాధారణ పసుపుకొమ్ము ద్వారా వచ్చే పసుపులా కాకుండా, దీని ద్వారా వచ్చే పసుపు కాస్త నలుపు రంగులో వుంటుంది. ఇది పసుపు వాసన కాకుండా కర్పూరం వాసనలా అనిపిస్తూ వుంటుంది.
ఔషధ దుకాణాల్లో లభించే ఈ పసుపు కొమ్మును ఒక మంచి రోజున ఇంటికి తీసుకు వచ్చి పూజలో ఉంచాలి. ఆ తరువాత ఉపయోగించడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నల్ల పసుపుకొమ్ము సిరిసంపదలను ప్రసాదించే మహిమను కలిగి వుంటుంది. ఇక దుష్ట గ్రహాల కారణంగా కలిగే బాధల నుంచి విముక్తి కలిగించడంలో ఇది ప్రధానపాత్రను పోషిస్తుంది.
దృష్టి దోషాలు ... గ్రహపీడలు ... తాంత్రిక సంబంధమైన ప్రయోగాల వలన నానా ఇబ్బందులు పడుతున్న వారు, నల్ల పసుపు కొమ్మును గింజలుగా చేసి మాలగా కట్టి, సాంబ్రాణితో ధూపం వేసి ధరిస్తే ఫలితం వుంటుంది. రెండు ... మూడు నల్ల పసుపు కొమ్ములను సిందూరం రంగు గుడ్డలో కట్టి, ప్రధాన ద్వారం పైన కట్టడం వలన దుష్టగ్రహాల బారి నుంచి బయట పడవచ్చు. అయితే ప్రతిరోజు ఇంట్లో పూజ అయ్యాక ప్రవేశ ద్వారానికి కట్టిన పసుపు కొమ్ములకు ధూపం చూపించవలసి వుంటుంది.
ఇక మానసిక వ్యాధులకు కూడా ఇది మంచి మందులా పనిచేస్తుంది. ఇటు ఆరోగ్యాన్ని ... అటు ఐశ్వర్యాన్ని ప్రసాదించే నల్ల పసుపుకొమ్ము మహిమాన్వితమైనదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.