మారేడు దళం
శివుడికి 'మారేడు చెట్టు'కి మధ్య విడదీయరాని విశిష్టమైన సంబంధం ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఎక్కడ మారేడు చెట్టు వుంటే అక్కడ శివ లింగాలు కనిపిస్తూ వుంటాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడిని మారేడు (బిల్వ ) దళాలతో పూజిస్తుంటారు. మారేడు చెట్టు కొమ్మలకి గల మూడు రేకుల భాగాన్ని 'దళం'అని అంటారు.
ఈ మారేడు దళం ఎంతో మహిమాన్వితమైనదనీ, సాక్షాత్తు పరమేశ్వరుడి సాయుజ్యాన్ని ప్రసాదించే శక్తి వీటికి వుందని పురాణాలు చెబుతున్నాయి. మారేడు దళంలోని మూడు రేకులు ... మూడు కన్నులు గల శివుడికి ప్రతీకగా చెప్పడమే కాకుండా, ఈ మూడు రేకులు సృష్టి - స్థితి - లయ కారకులైన బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులను ఆవిష్కరిస్తున్నాయనే భావన చేయడం జరుగుతోంది.
ఈ మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ గా ... కుడి వైపునది విష్ణువుగా ... మధ్యలో వున్నది శంకరుడిగా చెప్పబడింది. త్రిగుణాలను సమర్పిస్తున్నామనే భావన కూడా ఇందులో అంతర్లీనంగా మనకి కనిపిస్తుంది. బిల్వ పత్రానికి ముందు వైపున అమృతం ... వెనుక వైపున యక్షులు ఉండుట చేత ముందు భాగాన్ని శివుడి ముందు వైపు ఉంచుతూ పూజించాలని శాస్త్రం చెబుతోంది.
ఒకసారి కోసిన బిల్వాన్ని ఎనిమిది రోజులపాటు వాడుకోవచ్చు. అంతటి పవిత్రమైన మారేడు చెట్టును ఇంటి ఆవరణలో ఏ వైపునైనను పెంచుకోవచ్చును. మారేడు చెట్టు ఎక్కడ వుంటే అక్కడ సకల సంపదలు ... సుఖ సంతోషాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఇక మారేడు దళాలు అనేకమైన ఔషధ గుణాలను కలిగివున్నాయి. అందువలన వీటిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతుంటారు.