రుద్రాక్షలు
సతీదేవి వియోగం కారణంగా శివుడి కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లు రుద్రాక్షలుగా ఆవిర్భవించాయనీ, ఇవి మహా మహిమాన్వితమైనవని పురాణాలు చెబుతున్నాయి. అంతటి శక్తిమంతమైన రుద్రాక్షలకు ఇటీవల కాలంలో అనూహ్యమైన స్థాయిలో ప్రాధాన్యత పెరిగి పోయింది. పూర్వ కాలంలో అరుదుగా అక్కడక్కడా మాత్రమే కనిపిస్తూ ... సాధు సత్పురుషుల వలన మాత్రమే లభించే రుద్రాక్షలు ... ఇప్పుడు ప్రత్యేక ప్రదర్శనశాలల ద్వారా అందుబాటులోకి వస్తున్నాయంటే, వాటి ప్రాముఖ్యత ఏ స్థాయిలో పెరిగిందో తెలుసుకోవచ్చు.
అయితే మహిమాన్వితమైనటువంటి రుద్రాక్షలు ధరించడానికి ముందు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. రుద్రాక్షలలోని రకాలు ... వాటిని ధరించడం వలన కలిగే ప్రయోజనాలు ఎలాంటివి? వివిధ రకాల దోషాలను నివారించడంలో రుద్రాక్షలు ఎలాంటి పాత్రను పోషిస్తాయి? అనే విషయాలు తెలుసుకుంటే తగిన ఫలితాన్ని పొందడానికి అవకాశం వుంటుంది.
పురాణాల్లో రుద్రాక్షల పుట్టు పూర్వోత్తరాలను ప్రస్తావించడమే కాకుండా, ఏయే రుద్రాక్షలను ధరించడం వలన ఎలాంటి ఫలితాలుంటాయనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మేలైన రుద్రాక్షలను ధరిస్తూ విశిష్టమైన ప్రయోజనాలను పొందడం కోసం ఆ విషయాలను పరిశీలిద్దాం. అంతకు ముందుగా ఏయే జన్మ నక్షత్రాల వారు ఏయే రుద్రాక్షలను ధరిస్తే మంచిదో తెలుసుకుందాం
అశ్వని - మఖ - మూల నక్షత్రాల వారు 'నవముఖి' ... భరణి - పుబ్బ - పూర్వాషాడ నక్షత్రముల వారు 'షణ్ముఖి'... కృత్తిక - ఉత్తర - ఉత్తరాషాడ నక్షత్రముల వారు 'ఏకముఖి (లేదా ) ద్వాదశముఖి'... రోహిణి - హస్త - శ్రవణం నక్షత్రముల వారు 'ద్విముఖి' ... మృగశిర - చిత్త - ధనిష్ట నక్షత్రముల వారు 'త్రిముఖి' రుద్రాక్షను ... ఆరుద్ర - స్వాతి - శతభిషం నక్షత్రముల వారు 'అష్టముఖి' ... పునర్వసు - విశాఖ - పూర్వా భాద్ర నక్షత్రముల వారు 'పంచముఖి'రుద్రాక్షను ధరించడం మంచిది.
ఇక పుష్యమి - అనూరాధ - ఉత్తరాభాద్ర నక్షత్రముల వారు 'సప్తముఖి'... ఆశ్లేష - జ్యేష్ట - రేవతి నక్షత్రముల వారు 'చతుర్ముఖి' రుద్రాక్షలను ధరించవలసి వుంటుంది. ప్రతి రుద్రాక్షను దానికి సంబంధించిన మంత్రాలను జపిస్తూ ధరించాలి. శ్రావణ మాసంలో సోమవారం రోజున ... శివరాత్రి రోజున ధరించిన రుద్రాక్షలు మహోన్నతమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది.