ధన్యులను చేసే అష్ట సోమేశ్వరలింగాల దర్శనం
విశ్వవ్యాప్తంగా పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన లీలావిశేషాలను చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలు జ్యోతిర్లింగాలుగా ... పంచారామాలుగా వెలుగొందుతున్నాయి. సదాశివుడు ఎక్కడ కొలువైనా దాని వెనుక బలమైన కారణం వుంటుంది ... భక్తులను అనుగ్రహించాలానే ఆరాటం వుంటుంది.
అలా కొలువుదీరినవిగా 'అష్టసోమేశ్వర క్షేత్రాలు' దర్శనమిస్తున్నాయి. అత్యంత శక్తిమంతమైనవిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాలు, పురాణ సంబంధమైన ప్రాశస్త్యాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. తారకాసురుడిని కుమారస్వామి సంహరించగా, అసురుడి మెడలోని 'అమృతలింగం' అయిదు భాగాలై .. అయిదు ప్రదేశాల్లో పడుతుంది. అవే 'పంచారామాలు'గా ప్రసిద్ధి చెందాయి.
ఈ అయిదు భాగాలలో ఒకటి ఇప్పటి ద్రాక్షారామంలో పడగా, దానిని అక్కడ ప్రతిష్ఠించడానికి సప్తరుషులు వెళతారు. అయితే ఆ ప్రదేశంలో తీవ్రమైన ఉష్ణోగ్రత ఉండటం ... అక్కడ శివలింగ భాగం ప్రతిష్ఠించబడి వుండటం చూసి ఆశ్చర్యపోతారు. తనని సూర్యుడు ప్రతిష్ఠించడం వల్లనే ఆ ప్రదేశం అంత వేడిగా ఉందనీ, చల్లదనం కోసం తనకు ఎనిమిది దిక్కులలోను సోమలింగాలను ప్రతిష్ఠించమని సూర్యుడితో పాటు సప్తరుషులతో సదాశివుడు చెబుతాడు.
ఆదిదేవుడి ఆదేశం మేరకు ఆ ఎనిమిది మంది ఎనిమిది దిక్కులలో సోమలింగాలను ప్రతిష్ఠిస్తారు. అవే నేడు అష్ట సోమేశ్వర లింగాలుగా అలరారుతున్నాయి. కోలంక .. కోరుమిల్లి .. కోటిపల్లి .. వెల్ల .. వెంటూరు .. దంగేరు .. పెనుమళ్ల .. సోమేశ్వరం గ్రామాల్లో ఈ సోమలింగాలు దర్శనమిస్తూ వుంటాయి. శివుడి ఆదేశం మేరకు సూర్యుడితో కలిసి సప్తరుషులు ప్రతిష్ఠించిన ఈ క్షేత్రాలను దర్శించడం వలన, దారిద్ర్యం .. దుఃఖం నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పబడుతోంది.