సీమంతం
మాతృత్వాన్ని స్త్రీ ఒక వరంగా భావిస్తుంది. ఇక ఈ విషయంలో ఇటు పుట్టింటివారు ... అటు అత్తింటివారు కూడా ఆనందంతో పొంగిపోతుంటారు. మునుపటికన్నా ఎక్కువగా ఆమెను ప్రేమానురాగాలతో చూస్తుంటారు. స్త్రీకి సంబంధించిన ఆచారాలలో ... ఆమెకి ఏడవ నెల రాగానే 'సీమంతం' జరిపించడం మనకి కనిపిస్తుంటుంది.
ఈ సందర్భంగా జరిపే వేడుకలో పసుపు కుంకుమలు ... గాజులు ... పూలు - పండ్లు ... గంధం ... అక్షింతలు పాలుపంచుకుంటాయి. ముత్తయిదువులు పేరంటాలుగా వచ్చి ఈ వేడుకలో పాల్గొని సీమంతం జరుపుకునే స్త్రీకి గాజులు తొడిగి ... పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారాన్ని ఒక తంతుగా చూస్తే అది అవివేకమే అవుతుంది. సంతోషంగా ... సందడిగా జరుపుకునే ఈ వేడుక వెనుక ఆరోగ్యపరమైన అర్థం దాగి వుంది.
సీమంతం అనే వేడుక జరపడం వలన ఆ స్త్రీకి మానసికపరమైన ఉల్లాసం లభిస్తుంది. సంతానం గల ముత్తయిదువులంతా వచ్చి ఆశీర్వదించడం వలన వారి నుంచి ఆమెకి అవసరమైన శక్తి అందుతుంది. ప్రసవ సంబంధమైన ఆందోళన ఆమెకి లేకుండా చేస్తుంది.
ఇక సుఖప్రసవం జరగాలంటే గర్భకోశంపై తగినంత ఒత్తిడి వుండాలని వైద్య శాస్త్రం చెబుతోంది. చేతుల్లోని నరాలకు ... గర్భకోశానికి మధ్య అవినాభావ సంబంధం వుంటుంది. ఈ కారణంగా చేతులకు ఎక్కువగా గాజులు తొడగడం వలన అక్కడి నరాల ద్వారా గర్భకోశం పై కావలసినంత ఒత్తిడి పడుతుంది. ఫలితంగా సుఖప్రసవం జరుగుతుంది. ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి వున్న కారణంగానే నేటికీ ఆచారాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పొచ్చు.