లక్ష్మీ సమయం
సాధారణంగా ఉదయాన్నే ఇల్లు ఊడ్చి ఆ చెత్తను బయట పారవేసి శుభ్రం చేసిన తరువాత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే సాయంత్రం కూడా ఇల్లు ఊడ్చిన తరువాత పూజ గదిలో దీపారాధన చేస్తుంటారు. ఇక చాలా మంది తీరిక లేదంటూ రాత్రి సమయాల్లో ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఆ చెత్తను అవతల పారేస్తూ వుంటారు. అయితే ఈ విధంగా చేయడం తప్పని శాస్త్రం చెబుతోంది.
లక్ష్మీదేవి రాత్రి సమయాల్లో వస్తుందనే విశ్వాసం చాలామందిలో వుంది. ఆ సమయంలో ఆమెకి చెత్త పట్టుకుని ఎదురు పడకూడదనే ఉద్దేశంతోనే, రాత్రి వేళల్లో చెత్తను బయటవేయరాదని మన పూర్వీకులు చెబుతూ వచ్చారు.
ఇక రాత్రి సమయాల్లో చిన్నపాటి విలువైన వస్తువులు ... ముఖ్యమైన వస్తువులు కిందపడిపోయి కనిపించకపోవడం జరుగుతుంటుంది. చీకటి పడిన సమయంలో ఊడవడం వలన ఆ చెత్తలో అవికూడా కలిసిపోయి కనబడకుండా పోతాయనే భావన కూడా ఇందుకు కారణమై వుంటుంది. రెండు విధాలుగా భవిష్యత్తు తరాలవారు నష్ట పోకూడదనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఈ విషయాన్ని ఆచారాల జాబితాలో చేర్చినట్టు అర్ధమవుతోంది.