లక్ష్మీ నివాసం

లక్ష్మీ నివాసం
పూజ ఏదైనా దానిని పూర్తి చేయడానికి కొన్ని నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలి. లేదంటే ఆ పూజ చేయడం వలన వచ్చే ఫలితం రాకపోగా, పాప ఫలితాన్ని మూటగట్టుకోవలసి వస్తుంది. సాధారణంగా పూజ ఏదైనా సంపదలు ... సంతోషాలు ఆశించి మాత్రమే చేస్తుంటారు. మరి ఏ లోటూ లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని అనుకుంటే, అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతైనా అవసరం.

పసుపు ... పూలు ... ముగ్గు ... పాలు ... దీపాలు ... మంగళ ద్రవ్యాలు లక్ష్మీ దేవికి నివాస స్థానాలుగా చెప్పబడ్డాయి. అందువలన ప్రతి పూజలో వీటిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి నిత్యం ఉదయాన్నే వాకిట్లో శుభ్రం చేసి ముగ్గులుపెట్టి, పూజామందిరాన్ని పరిశుభ్ర పరిచి పూజలు చేసే ఇళ్లకి రావడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. గడపకు పసుపు రాసి ... కుంకుమ బొట్లతో అలంకరించి ... గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టిన ఇంట్లో ఉండటానికి ఆమె సిద్ధపడుతుందని శాస్త్రం చెబుతోంది.

ఇక ఉదయాన్నే నిద్రలేవని వారి ఇంటికి ... నిషిద్ధమైన రోజుల్లో పూజా మందిరం వైపు వెళ్లే స్త్రీలు వున్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదనే ప్రస్తావన మనకి ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. కాబట్టి పూజకి తగిన ఫలితం దక్కాలంటే, అందుకు పవిత్రతతో కూడిన నియమ నిబంధనలను అతిక్రమించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది.

More Bhakti Articles