నవగ్రహారాధన

నవగ్రహారాధన
నిత్యం దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకుంటున్నా ... భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పొరపాటున అపచారంగానీ చేస్తున్నామేమోననే సందేహం వెంటాడుతూనే వుంటుంది. అలా సందేహాన్ని రేకెత్తించే వాటిలో 'నవగ్రహారాధన'ఒకటి. సహజంగానే శివాలయాల్లో నవగ్రహాలు కొలువుదీరి వుంటాయి. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసిన తరువాత శివాలయంలోకి వెళ్లాలా? లేదంటే శివయ్య దర్శనం చేసుకున్న తరువాత నవగ్రహాల చుట్టూ తిరగాలా? అనే సందేహం మాత్రం తలెత్తుతూనే వుంటుంది.

ఈ నేపథ్యంలో ఎవరికి తోచింది వాళ్లు చెబుతూ వుండటం వలన మరింత అయోమయ పరిస్థితులు ఎదురవుతూ వుంటాయి. ఇక మరికొందరేమో ఈ విషయంలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి, ఆ తరువాత కాళ్లు కడుక్కుని శివయ్య దర్శనం చేసుకుంటూ వుంటారు. అయితే శాస్త్రం కూడా నవగ్రహాలను ముందుగా దర్శించుకున్న తరువాతే గర్భాలయంలోని శివయ్యను దర్శించుకోవడం సరైనదని చెబుతోంది.

ఎందుకంటే శివుడిని దర్శించుకున్న తరువాత వెంటనే కాళ్లు కడుక్కోవడం అపచారమని అది తెలియజేస్తోంది. ఇక నవగ్రహాలకు ప్రదక్షిణమైనా ... అభిషేకమైనా అది సూర్యోదయం తరువాత, సూర్యాస్తమయానికి ముందు వరకు మాత్రమే జరగాలనే నియమం మాత్రం తప్పనిసరిగా పాటించవలసి వుంటుంది.

More Bhakti Articles