ప్రదక్షిణ

ప్రదక్షిణ
సాధారణంగా ప్రధాన ద్వారం దాటుకుని గుడిలోకి వెళ్లగానే, ప్రధాన దైవం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాతే దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు. ప్రదక్షిణం అంటేనే ... సమస్త భయాలను ... వ్యాధులను తరిమేసి, సకల సంపదలు ప్రసాదించేదని అర్థం. ఈ ప్రదక్షిణలు ... పాద ప్రదక్షిణము ... అంగ ప్రదక్షిణం ... దండ ప్రదక్షిణం ... మిశ్రమ ప్రదక్షిణం అని నాలుగు రకాలుగా వుంటాయి.

ఇవి కాకుండా తల్లిదండ్రులకు ... గురువులకు చేసే ప్రదక్షిణలు మరింత ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ప్రదక్షిణలను మూడు ... అయిదు ... తొమ్మిది ... పదకొండు ... ఇలా బేసి సంఖ్యలో చేస్తుంటారు. అయితే ప్రదక్షిణలు చేయునపుడు ఆచరించవలసిన కొన్ని నియమాలను గురించి, సూతుడు శౌనకాది మహర్షులకు వివరించాడు.

ప్రదక్షిణలు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో గబగబానడవడం గానీ .. పరిగెత్తడంగాని చేయకూడదు. ప్రదక్షిణ చేస్తోన్న సమయంలో వినయ పూర్వకంగా చేతులు జోడించి వుండాలి. పరమాత్మను మనసులో నిలుపుకుని .... ఆయననే ధ్యానిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ఇలా నియమబద్ధమైన ప్రదక్షిణలు చేసినప్పుడు తగిన ఫలితాలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

More Bhakti Articles