నైవేద్యం
ఏ దైవానికి ఏ పూజ చేసినా 'నైవేద్యం' తప్పనిసరిగా పెట్టవలసిందే. ధూప .. దీపాల తరువాత దైవానికి నివేదన చేసిన దానిని ప్రసాదంగా స్వీకరించాలి. అందువలన సాధ్యమైనంత వరకూ సాత్వీకమైన ఆహార పదార్థాలను దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. పులుపు ... కారం ... ఉప్పు ఎక్కువగా వున్న పదార్థాలు గానీ, తయారుచేసి చాలాసేపైన పదార్థాలు గాని దైవానికి నైవేద్యం పెట్టకూడదు.
ఇక ఒక్కో దైవానికి ఒక్కో పదార్ధం ఇష్టమంటూ ఆ వివరాలను కూడా మన పూర్వీకులు తెలియజెప్పారు. ఈ నాటికి కూడా ఆ విధంగానే నైవేద్యాలను సమర్పించడం జరుగుతూ వస్తోంది. ఫలాలను నైవేద్యంగా సమర్పించే విషయానికే వస్తే, మామిడి ... అరటి ... కమల ... సపోటా ... ద్రాక్ష ... పనస పండ్లు శ్రేష్టమైనవని చెప్పబడుతున్నాయి. ఇక పదార్ధాల విషయానికి వస్తే పులిహోర ... చక్రపొంగలి ... దధ్యోదనం ప్రధానంగా కనిపిస్తాయి.
అమ్మవారికి సంబంధించినంత వరకూ సోమవారం - పాలు, మంగళవారం - అరటి పండ్లు, బుధవారం - వెన్న, గురువారం - పటిక బెల్లం, శుక్రవారం - చక్కెర, శనివారం - ఆవు పాలు ఉత్తమమైనవని చెప్పబడుతున్నాయి. ఇక భగవంతుడికి సమర్పించే ఈ పదార్థాలను వెండి ... రాగి పాత్రల్లోగానీ, మోదుగ ... తామరాకుల్లో గాని వుంచి నైవేద్యంగా సమర్పిస్తే అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి.