బల్లిపాటు (ముఖభాగాలు)
'నుదురు'పై బల్లి పడితే సిరిసంపదలు ... పేరు ప్రతిష్ఠలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. 'కనుబొమల పై' పడితే అనుకోని కారణాల వలన డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. 'కనుబొమల మధ్య' పడితే ఆర్ధికంగా మరింత బలపడే అవకాశాలు వున్నాయి. 'కనుబొమల చివరన' పడితే ... ఎంతోకాలంగా వారు ఎదురు చూస్తున్న శుభకార్యాలు జరుగుతాయి. మగవారికి 'కుడికంటి'పై ... ఆడవారికి 'ఎడమకంటి'పై బల్లిపాటు శుభాలను సూచిస్తుంది.
'ముక్కుపై' బల్లి పడితే ఆ తరువాత అనారోగ్యానికి గురవుతారు. 'ముక్కు మధ్య' లో పడితే సంపద పెరగడమే కాకుండా, సంతృప్తినిచ్చే శుభకార్యాలు జరుగుతాయి. 'ముక్కు చివరన' పడితే ఊహించని విధంగా సమస్యలు చుట్టుముట్టి మనఃశాంతి లేకుండా చేస్తాయి.
'పై పెదవి'పై బల్లి పడితే అనుకోని విధంగా ఆస్తి పాస్తులు కలిసి రావడం ... ఉద్యోగాల్లో ఉన్నతస్థాయి లభించడం జరుగుతుంది. 'కింది పెదవి'పై పడితే ఆహార సంబంధమైన విషయాల్లో ఎలాంటి లోటు లేకుండా గడిచి పోతుంటుంది. ఒకవేళ రెండు పెదవులపై ఒకేసారి బల్లి పడితే అది మరణ సంకేతాన్ని సూచిస్తుంది.
స్త్రీలకు 'గెడ్డం'పై బల్లి పడటం వలన ఎలాంటి చెడు ఫలితం వుండదు గానీ, మగవారికి 'గెడ్డం'పై పడటం వలన వారు అనుకోని ఆపదల్లో చిక్కు కుంటారు. దీని పర్యవసానంగా వారు జైలు శిక్షను అనుభవించే అవకాశం లేకపోలేదు.
సాధారణంగా మగవారికి 'కుడి చెంప' పై ... ఆడవారికి 'ఎడమచెంప'పై బల్లిపడితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందుకు భిన్నంగా జరిగితే ఇద్దరికీ కీడు జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. మగవారికి 'కుడిచెవి పై' ... ఆడవారికి 'ఎడమ చెవి పై' బల్లి పడితే సంపదలు - శుభాలు కలుగుతాయి. ఇందుకు వ్యతిరేకంగా జరిగితే, సమస్యలతో సతమతమై పోతుంటారు.