పుట్టుమచ్చలు (కళ్లు - గెడ్డం)
'కుడికంటి రెప్ప పై' పుట్టుమచ్చ వుంటే ... డబ్బుకు కొదవ వుండదు. సంపాదనకి తగిన విధంగా ఖర్చు చేస్తూ,విచారానికి దూరంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తమకి తామే గొప్ప వాళ్లుగా భావించుకుంటూ మిగతా వారిని తక్కువగా చూస్తూ గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. వీరిలో దైవభక్తి అధికంగానే ఉన్నప్పటికీ, సమయం రాగానే తమ సహజమైన స్వభావాన్ని చూపుతూ గొప్పలకి పోతుంటారు.
'ఎడమ కనురెప్ప పై' పుట్టుమచ్చ ... అపకీర్తినీ ... అవమానాలను తెచ్చి పెడుతుంది. స్వతహాగా వీరికి వుండే అహంకారంవల్ల శత్రువులు ఏర్పడతారు. సహజంగానే అహంకారం అందరికీ దూరం చేయడమే కాకుండా, అన్ని విధాలా కుంగదీస్తుంది. నామ మాత్రమైన సంపాదన ... నిరాశా నిస్పృహలతో వీరి జీవితం కొనసాగుతుంది.
'పై కనురెప్ప లోపలి భాగంలో' పుట్టుమచ్చ వుంటే ... అదృష్ట వంతులు ... ఐశ్వర్య వంతులని చెప్పాలి. తోటి వారిని వీరు అభిమానిస్తారు ... దైవాన్ని ఆరాధిస్తారు. తమ కింది స్థాయివారికి ఆదర్శ ప్రాయులై నడుచుకుంటూ, దేవుడికి విశేషమైన రీతిలో కానుకలను సమర్పిస్తుంటారు. ఇక 'కిందిరెప్ప లోపలి భాగంలో' వుంటే ... పైన చెప్పబడినవాటికి భిన్నమైన ఫలితాలు వుంటాయి.
ఇక పుట్టుమచ్చ 'గెడ్డం మధ్య భాగంలో' వుంటే ... తెలివి తేటలు ... నేర్పు ... ఓర్పు కలిగిన వారిగా కనిపిస్తారు. ప్రేమానురాగాలను ప్రదర్శించడమే కాదు ... అవసరమైతే త్యాగాలకు సైతం సిద్ధపడతారు. సంపాదించిన డబ్బును సద్వినియోగం చేస్తూ, తమ ఉదార స్వభావంతో అందరి ప్రశంసలు అందుకుంటూ వుంటారు.
ఇక 'గెడ్డం కింద' పుట్టుమచ్చ వుంటే ... సంగీత సాహిత్యాల విషయంలో విశేషమైన కృషి చేస్తారు. తమ మాటకారి తనంతో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే నేర్పు వీరి సొంతం. పుట్టుమచ్చ 'గెడ్డానికి కుడివైపున' వుంటే ... మంచి ప్రతిభావంతులుగా ప్రశంసలు అందుకుంటారు. మాట కారితనంతో అందరినీ ఆకట్టుకుంటూ, అందరూ గొప్పగా చూసే హోదాను కలిగి వుంటారు.
ఇక 'గెడ్డానికి ఎడమవైపున' పుట్టుమచ్చ వుంటే ... కోపిష్టి అనే ముద్ర వేయించుకుంటారు. విషయమేదైనా కోపంగా మాట్లాడుతూ చుట్టు పక్కల వున్న వారిని శత్రువులుగా చేసుకుంటారు. ఇక సంపాదించిన డబ్బును అవసరమా ... కాదా ... అనే విచక్షణ లేకుండా విచ్చల విడిగా ఖర్చు చేస్తుంటారు. అందువలన వీరి జీవితం ఎప్పుడూ ఒడి దుడుకుల్లోనే సాగిపోతూ వుంటుంది.
ఇక స్త్రీల విషయంలో గెడ్డం మీద పుట్టుమచ్చ సర్వ శుభాలను చేకూరుస్తుంది. గుణవంతుడైన భర్త లభించడం ... అతనికి మంచి సంపాదన వుండటం ఆమె అదృష్టమేనని చెప్పాలి. కుటుంబాన్ని ఆమె ఓ పద్ధతి ప్రకారం నడిపించడం వలన, నిండు కుండలా ఆ సంసారం హాయిగా ... సాఫీగా సాగిపోతుంది.