రక్షించిన రామచంద్రుడు
సికిందర్ పాదుషా దండయాత్రలు చేస్తూ కబీర్ నివసిస్తోన్న గ్రామ పొలిమేరల్లో విడిదిచేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాదుషా బస చేసిన గుడారాల చెంతకు చేరుకుంటారు. హిందువులు ... ముస్లిములు కలిసిరావడం సికిందర్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విషయమేవిటో చెప్పమని అడుగుతాడు.
దాంతో వాళ్లంతా కబీర్ వలన గ్రామంలో జరుగుతోన్న సంఘటనలను గురించి వివరిస్తారు. రెండు వర్ణాలను సంకరం చేస్తూ కొత్త గొడవలకు కారణమవుతున్నాడని అంటారు. అతణ్ణి పిలిపించి తగిన విధంగా బుద్ధిచెప్పమని పట్టుపడతారు. వెంటనే కబీర్ ను పిలిపించిన పాదుషా, అతనిపై వచ్చిన అభియోగాల గురించి ప్రస్తావిస్తాడు. తాను ఏ వర్ణానికీ ... వర్గానికి చెందిన వాడిని కానని కబీర్ తేల్చి చెబుతాడు.
మానవత్వమే తన మతమనీ, ఆ దారిలోనే తాను ముందుకి వెళుతూ ఉంటానని కబీర్ అంటాడు. ఈ విషయంలో తన మనసు మార్చడానికి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని చెబుతాడు. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన పాదుషా, కబీర్ ను ఏనుగుతో తొక్కించమని సేనాధిపతిని ఆదేశిస్తాడు. కబీర్ ను తొక్కించడానికి మదించిన ఏనుగును తీసుకువస్తారు.
ఆ ఏనుగు అతణ్ణి తొక్కడానికి రాగానే దాని కళ్ళకు శ్రీ రాముడిలా కబీరు కనిపిస్తాడు. అంతే ఆ ఏనుగు తన ప్రయత్నాన్ని మానుకుని వెనక్కి వచ్చేస్తుంది. మరో ఏనుగు ద్వారా ప్రయత్నించినా అలాగే జరగడంతో సిపాయిలంతా ఆశ్చర్యపోతారు. ఆయనకి దైవం అండగా వుందని అందులో కొందరు గ్రహిస్తారు. అయితే ధైర్యం చేసి ఎవరూ కూడా బయటికి చెప్పరు. పాదుషా మాత్రం కబీరుకి ఏ శిక్ష విధిస్తే బాగుంటుందా అని మరింత పట్టుదలతో ఆలోచిస్తూ వుంటాడు.