పార్వతిదేవి ఆభరణాల గుర్తులు
మహాశివుడి లీలలను గురించి తెలుసుకోవడానికి మానవుడి జీవితకాలం సరిపోదు. అనురాగపూరితమైన ఆయన తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి మరుజన్మలు సైతం చాలవు. అలాంటి ఆదిదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శించడాన్ని భక్తులు ఒక వరంగా భావిస్తూ వుంటారు. కైలాసనాథుడిని కనులారా తిలకించడం కన్నా అసలైన అదృష్టం ఏవుంటుందనే అనుకుంటూ వుంటారు.
అలా సదాశివుడి క్షేత్రాలను దర్శించినప్పుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ వుంటుంది. వివిధ క్షేత్రాలలో శివలింగాలకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే, రూపంలోనూ ... పరిమాణంలోను విభిన్నమైన ఆకృతులు కలిగినవి కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మట్టితో ... ఇసుకతో ... చెట్టు మొదలుతో ... రాళ్లతో ప్రతిష్ఠించబడిన శివలింగాలు దర్శనమిస్తూ వుంటాయి.
అలా మట్టితో చేసిన శివలింగం 'కాంచీపురం'లో కొలువై 'ఏకామ్రేశ్వరుడు' పేరుతో పూజలందుకుంటోంది. అయితే కేవలం మట్టితో చేయబడిన శివలింగమైతే ఇంత ప్రాధాన్యత వుండేది కాదు. ఆ శివలింగంపై పార్వతీదేవి ఆభరణాల ముద్రలు వుండటం ఇక్కడి ప్రధాన విశేషం. అమ్మవారు కాత్యాయనిగా వున్నప్పుడు మట్టితో శివలింగం చేసి శివుడి గురించి కఠోర తపస్సు చేస్తుంది. పరమశివుడి ఆదేశం మేరకు గంగాదేవి ఆమె భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుంటుంది.
అనుకున్నదే తడవుగా ఉరుకులు పరుగులు తీస్తూ వచ్చి ఆ మట్టి శివలింగాన్ని ముంచేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకుంటూ అమ్మవారు శివలింగాన్ని హృదయానికి గట్టిగా హత్తుకుని కూర్చుంటుంది. ఆ సమయంలో జరిగిన ఒత్తిడి కారణంగా, ఆమె ఆభరణాలు శివలింగానికి వత్తుకుపోయి దానిపై గుర్తులు ఏర్పడ్డాయి. అమ్మవారి ఆభరణాల గుర్తులనే స్వామి అలంకారాలుగా చేసుకోవడం వలన, ఇప్పటికీ ఈ మట్టి శివలింగం చెక్కుచెదరకపోవడం వలన ఇది మరింత మహిమాన్వితమైనదని చెబుతుంటారు.