పుట్టుమచ్చలు (తల)
పూర్వకాలం నుంచి నేటి వరకూ వ్యక్తులను గుర్తించడంలోను ... వారి స్వరూప స్వభావాలను ఆవిష్కరించడంలోను పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా, అదృష్ట ... దురదృష్టాలకు సైతం సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి.
విద్య ... వివాహం ... సంపద ... సౌభాగ్యం ... ఆనందం ... ఆయుష్షును ప్రతిబింబించే ఈ పుట్టుమచ్చలను ఆధునిక కాలంలోనూ విశ్వసించే వారు లేకపోలేదు. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు ... ఆకారం ... పరిమాణం ... స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ప్రధానమైన స్థానాల్లోని పుట్టుమచ్చలు ఈ క్రింది ఫలితాలను సూచిస్తున్నాయి.
'తల' పై మాడు భాగానికి 'కుడి వైపున' పుట్టుమచ్చ ఉన్నట్టయితే ... రాజకీయాలపై అవగాహన కలిగి వుండి ... ఏదో ఒక పదవిలో కొనసాగుతూ వుంటారు. మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా, ముందుచూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు. అణకువగల భార్య ... వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖసంతోషాలతో సాగిపోతూ వుంటుంది.
ఇక మాడుకు 'ఎడమ వైపున' పుట్టుమచ్చ ఉన్నట్టయితే ... మంచి తెలివితేటలతో పాటు మాటకారులు అయ్యుంటారు. సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. సంసారాన్ని ... సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు, వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు.
మాడు భాగానికి 'ముందువైపున'పుట్టుమచ్చ ఉన్నట్టయితే ... ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. ముందు చూపుతో భవిష్యత్తును నిర్మించుకునే వీరికి సంపాదనే కాదు ... సంతానమూ ఎక్కువే.
ఇక మాడుకు 'వెనుక వైపున' పుట్టుమచ్చ ఉన్నట్టయితే ... పేరు ప్రతిష్ఠలకన్నా డబ్బు గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. భార్య పై ప్రేమానురాగాలే కాదు ... ఇతర వ్యామోహాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. సంపాదనకు కొదవ ఉండకపోవడంవల్ల వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు.
ఇక స్త్రీల విషయానికి వస్తే 'తల'పై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి. దురుసుతనానికి ... నిదర్శనంగా వీరు కనిపిస్తారు. మంచి మార్గాలకు సాధ్యమైనంత దూరంలో ఉంటూ, అందుకు పూర్తి భిన్నమైన పనులు చేయడంలో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు.