ఆలుమగలు దర్శించే క్షేత్రం
సాధారణంగా కొన్ని పుణ్యక్షేత్రాల్లో సీతారాములు ... మరికొన్ని పుణ్యక్షేత్రాల్లో పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ వుంటారు. అయితే సీతారాములతో పాటు ఆదిదంపతులు కొలువైన క్షేత్రాలు మాత్రం కాస్త అరుదుగానే కనిపిస్తుంటాయి. అలాంటి ప్రత్యేకతను సంతరించుకున్న క్షేత్రం మనకి మహబూబ్ నగర్ జిల్లా 'మాధారం' లో కనిపిస్తుంది.
ఇక్కడ ప్రాచీనకాలానికి చెందిన జంటదేవాలయాలు నయనానందకరంగా దర్శనమిస్తూ వుంటాయి. సువిశాలమైన ప్రదేశంలో అలనాటి వైభవానికి అద్దం పడుతోన్న ఈ ఆలయాలు తమ ప్రత్యేకతను చాటుతూవుంటాయి. లోకంలో ఆదర్శవంతమైన ... అన్యోన్యవంతమైన దాంపత్యానికి సీతారాములను ... శివపార్వతులను ప్రతీకగా చెబుతూ వుంటారు. అలాంటి దంపతులు తమ వూరిలో కొలువుదీరి ఉండటాన్ని ఇక్కడి గ్రామస్తులు తమ అదృష్టంగా భావిస్తూ వుంటారు.
హరిహరులు ఆవిర్భవించిన కారణంగా ఏడాది పొడవునా ఈ క్షేత్రం భక్తులరాకతో సందడిగా కనిపిస్తూ వుంటుంది. శివాంశ సంభూతుడు ... రామభక్తుడు అయిన హనుమంతుడు ఈ క్షేత్రానికి పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు ... మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతులకు ఘనంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతుంటారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు ... శివకేశవుల అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. సతీసమేతంగా శివకేశవులు కొలువైన కారణంగా,ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారి దాంపత్యం అన్యోన్య వంతంగా సాగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.