దత్తాత్రేయస్వామి వరం
కార్తవీర్యార్జునుడు చొట్ట చేతులతో జన్మిస్తాడు. యువరాజైన అతను చొట్ట చేతుల కారణంగా ఎలాంటి యుద్ధ విద్యలు నేర్చుకోలేకపోతాడు. యవ్వనంలోకి అడుగుపెట్టిన అతను రాజుగా పరిపాలనా బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. దాంతో కార్తవీర్యార్జునుడు తన అసమర్ధతను నిందించుకుంటూ కుమిలిపోతుంటాడు. అతను సింహాసనంపై కూర్చుంటేచాలనీ, మిగతా విషయాలు తాముచూసుకుంటామని మహామంత్రి ... రాజ గురువు ధైర్యం చెబుతారు.
అందుకు కార్తవీర్యార్జునుడు నిరాకరిస్తాడు. తనని తాను రక్షించుకోలేని రాజు, ప్రజలను ఎలా కాపాడతాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. చచ్చుబడిన తన చేతులు పరాక్రమవంతంగా పనిచేయడానికి మార్గమేదైనా వుంటే తెలుపమని కోరతాడు. దాంతో వాళ్లు దత్తాత్రేయస్వామిని ఆశ్రయించమని సూచిస్తారు. ఆ స్వామి అనుగ్రహం వుంటే లభించనిది లేదని చెబుతారు.
స్వామి ఆచూకీ తెలుసుకుంటూ బయలుదేరిన కార్తవీర్యార్జునుడు, అతి కష్టం మీద ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తాడు. దత్తాత్రేయస్వామి పాదాలపైబడి కరుణించ వలసిందిగా కోరతాడు. తన పట్ల అతనికి గల విశ్వాసాన్ని పరీక్షించిన దత్తాత్రేయుడు, విషయమేవిటని అడుగుతాడు. సంతోషంతో పొంగిపోయిన అతను తనకి వెయ్యి బలమైన చేతులు కావాలనీ, తన పరాక్రమానికి తిరుగుండకూడదని వరాలు కోరతాడు.
తనని అనఘాదేవి సమేతంగా పూజించమనీ, 'అనఘాదేవి వ్రతం' చేయడం వలన కోరుకున్నవి లభిస్తాయని దత్తాత్రేయుడు అనుగ్రహిస్తాడు. ఆ వ్రతం యొక్క విధి విధానాలను చెప్పి మరీ పంపిస్తాడు. స్వామి ఆదేశం మేరకు అనఘాష్టమీ వ్రతం చేసిన కార్తవీర్యార్జునుడు, వెయ్యి చేతులను పొందుతాడు. స్వామికి కృతజ్ఞతలు తెలియజేసి రాజ్యానికి చేరుకొని రాజుగా సింహాసనాన్ని అధిష్టిస్తాడు.