శ్రీపాద వల్లభ క్షేత్రం
దత్తాత్రేయస్వామి భక్తులైన సుమతి - అప్పలరాజు శర్మ దంపతులకు క్రీ.శ.13 వ శతాబ్దం తొలినాళ్లలో శ్రీపాద శ్రీవల్లభస్వామి జన్మించాడు. తన భక్తుల ముచ్చట తీర్చడం కోసమే దత్తాత్రేయస్వామి .... వారి ఇంట పుత్రుడిగా అవతరించాడు. అందువల్లనే దత్తాత్రేయస్వామి తొలి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభస్వామిని చెబుతుంటారు. బాల్యంలోనే అనేక మహిమలను ప్రదర్శించిన శ్రీపాదవల్లభుడు, సమస్త శాస్త్రాల సారాన్ని గ్రహిస్తూ యవ్వనంలోకి ప్రవేశించాడు.
తన అవతారకార్యాన్ని గురించి తల్లిదండ్రులకు వివరించి, సన్యాసం స్వీకరించి ఇల్లు విడిచి బయలుదేరాడు. అలా ఆయన అనేక ప్రాంతాలను దర్శిస్తూ 'కురువపురం' చేరుకున్నాడు. ఈ క్షేత్రం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో దర్శనమిస్తుంది. ఇక్కడి కృష్ణా నది తీరంలో శ్రీపాద వల్లభుడు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నాడు. ఆయన నడయాడిన పుణ్యభూమిగా ... పవిత్ర స్థలంగా ... ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది.
కృష్ణానది తీరాన ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడిన ఇక్కడి ఆలయం ఆనాటి రోజులను కళ్లముందు ఆవిష్కరిస్తూ వుంటుంది. గర్భాలయంలో శ్రీపాద వల్లభుడి విగ్రహం దర్శనమిస్తూ వుంటుంది. ''దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ... దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా'' అంటూ భక్తులు ఆలయం చుట్టూ భజనలు చేస్తూ ప్రదక్షిణలు చేస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 'పుట్టి' ద్వారా నదిని దాటి వస్తుంటారు. ఇక్కడి మేడిచెట్టును ... పాతాళ వినాయకుడిని భక్తులు పూజిస్తూ వుంటారు.
ఇక్కడి గ్రామస్తులతో స్వామికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. స్వామి అనుగ్రహం కారణంగా వివిధ రకాల వ్యాధుల బారి నుంచి ... పేదరికం బారి నుంచి ... పాపాల బారి నుంచి బయటపడిన వాళ్లు ఎందరో వున్నారు. ఆ సంఘటనలను నేటికీ కథలుగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఈ క్షేత్రాన్ని స్పర్శిస్తూ వెళ్లే కృష్ణా నది ఎంతో మహిమాన్వితమైనదనీ, ఈ ప్రదేశంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు మటుమాయమై పోతాయని చెబుతారు.
గురువారం రోజుల్లోనూ ... గురుపౌర్ణమి ... దత్తాజయంతి వంటి పర్వదినాల్లోను ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. శ్రీ శైల క్షేత్రంలో సంకల్ప మాత్రం చేత అంతర్హితుడైన స్వామి, నేటికీ ఈ క్షేత్రంలో సూక్ష్మ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.