సూర్యపుత్రుల శాపవిమోచనం
సూర్యపుత్రులైన అశ్వనీకుమారులు ... సుకన్య పాతివ్రత్యానికి మెచ్చి, ఏదైనా వరం కోరుకోవలసిందిగా అడుగుతారు. భర్త ప్రేమానురాగాలు తనకి పుష్కళంగా లభిస్తున్నాయనీ, తాను కోరుకోవలసింది ఏమీ లేదని అంటుంది సుకన్య. దాంతో వాళ్లు చ్యవన మహర్షిని ఒత్తిడి చేస్తారు. యవ్వనము ... చూపులేని కారణంగా తాను సుకన్యను చాలా ఇబ్బంది పెడుతున్నాననీ, ఆ రెండింటిని ప్రసాదించమని కోరతాడు మహర్షి.
అందుకు వాళ్లు అంగీకరిస్తూ అనుగ్రహించడంతో, చ్యవన మహర్షికి యవ్వనంతో పాటుగా చూపు వస్తుంది. తన పట్ల దురుద్దేశంతోనే చ్యవన మహర్షిని అశ్వనీకుమారులు కలిశారని భావించి ఇంద్రుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. గాడిదలుగా జీవించమంటూ అశ్వినీకుమారులను శపిస్తాడు. దాంతో చ్యవన మహర్షి ఆశ్రమంలో వున్న అశ్వనీకుమారులు ఒక్కసారిగా గాడిదలుగా మారిపోతారు. ఊహించని ఈ సంఘటనకు సుకన్య బిత్తరపోతుంది.
దివ్య దృష్టితో విషయం తెలుసుకున్న చ్యవన మహర్షి,జరిగినదానికి దేవేంద్రుడు కారకుడని సుకన్యతో చెబుతాడు. తమ ఆశ్రమానికి రావడం వల్లనే అశ్వనీ కుమారులకు ఆ పరిస్థితి ఏర్పండిందనీ, వాళ్లకి శాపవిమోచనం కలిగించవలసిన బాధ్యత తమపై వుందని అంటాడు. ఆమె తన పాతివ్రత్య మహాత్మ్యంతో అశ్వనీకుమారులకు పూర్వరూపం వచ్చేలా చేస్తుంది. తమకి శాపవిమోచనం కలిగించిన సుకన్యకు వాళ్లు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తారు.