గ్రామదేవతలుగా ఇద్దరు అమ్మవార్లు
ప్రతి ఊరుకి ఓ గ్రామదేవత వుంటుంది. ఆ దేవతతో ఆ గ్రామస్తులకు విడదీయరాని అనుబంధం వుంటుంది. తమ మంచి చెడ్డలను అమ్మవారే చూసుకుంటుందని అక్కడి గ్రామస్తులు భావిస్తుంటారు. వివిధ కార్యాల నిమిత్తం గ్రామం నుంచి బయలుదేరుతున్నప్పుడు ... గ్రామంలోకి తిరిగి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడి వాళ్లు అమ్మవారికి నమస్కరించడం మరిచిపోరు. ప్రతి రోజూ వాళ్లు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు ... కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
అలా గ్రామదేవతను తమ తల్లిగా భావించి ఆరాధించే ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని 'ఊడిపూడి'లో దర్శనమిస్తుంది. సాధారణంగా చాలా గ్రామాల్లో గ్రామదేవతగా ఒకే మూర్తి దర్శనమిస్తుంది. అందుకు భిన్నంగా ఇక్కడ 'బంగారు తల్లి' ... 'బంగారు పాప' అనే పేర్లతో ఇద్దరు గ్రామదేవతలు కొలువై వుంటారు. ఈ గ్రామంలో ప్రధాన దైవాలుగా 'లక్ష్మీ నృసింహ స్వామి' ... 'శివుడు' దర్శనమిస్తుంటారు. ఈ దైవాలతో సమానమైన ఆదరణని ఇక్కడి అమ్మవార్లు పొందుతూ వుండటం విశేషం.
ఈ అమ్మవారి ఆలయాలు గ్రామానికి రెండు 'కళ్లు' గా, ఊరి మధ్యలో చెరో పక్కన కనిపిస్తూ వుంటాయి. ఇద్దరు అమ్మవార్లు కూడా పద్మాసనంలో కూర్చుని ఆరు అడుగుల ఎత్తులో భారీగా దర్శనమిస్తుంటారు. ఆయుధాలతో పాటుగా అమ్మవార్లు కుంకుమ భరిణె పట్టుకుని వుంటారు. విశాల నేత్రాలతో ... అనురాగాన్ని వర్షింపజేసే చూపులతో అమ్మవారి విగ్రహాలు కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తుంటారు ... ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి అమ్మవారికి నైవేద్యాలు ... కానుకలు ... వస్త్రాలు సమర్పిస్తుంటారు.
ఈ ఊరుకి చెందిన ఆడపిల్లలు అత్తవారింటి నుంచి పండగలకివస్తే వారిని చూసి బంగారు తల్లి అమ్మవారు సంతోషంతో పొంగిపోతుందని చెబుతారు. వారికి సంతాన సౌభాగ్యాలను ఆ తల్లే అనుగ్రహిస్తుందని అంటారు. ఇక ఈ ఊరికి కొత్త కోడళ్లుగా వచ్చిన యువతుల బాగోగులను బంగారుపాప అమ్మవారు చూసుకుంటుందట. ఈ మాట విన్నప్పుడు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అమ్మవారిని విడిచి రావాలంటే అమ్మని విడిచి వస్తున్నంత బాధకలుగుతుంది.