ఆవహించిన నరసింహుడు
భగవంతుడు తన భక్తులను రక్షించడానికి ... వారి మనవిని మన్నించడానికి చేసే ప్రయత్నాలనే మహిమలుగా చెప్పుకుంటూ వుంటారు. మహిమాన్వితమైన అలాంటి సంఘటనలు గొప్పవారి జీవితాల్లో ఎక్కువగా తారసపడుతూ వుంటాయి. అలాంటివారి జాబితాలో మనకి ఆదిశంకరాచార్యుల వారు కూడా కనిపిస్తారు.
పూర్వం శ్రీశైలంలో వామాచార సంప్రదాయం వుండేది. ఇక్కడి కాపాలికులు దైవానికి జంతుబలులు నిర్వహిస్తూ ... మద్యమాంసాలు స్వీకరిస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వుండేవారు.
శివుడి అనుగ్రహాన్ని పొందడానికి తాము ఆచరిస్తోన్న పద్ధతే సరైనదనే విశ్వాసం వాళ్లలో బలంగా వుండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిశంకరాచార్యుల వారు శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ శివయ్య దర్శనం చేసుకుని పాలధార - పంచధార అనే ప్రదేశంలో తపస్సు చేసుకోసాగాడు. అయితే శంకరాచార్యుల వారి గొప్పతనం గురించి ముందుగానే విన్న కాపాలికులు, ఆయన ప్రభావం తమ సంప్రదాయాన్ని తుడిచి పెట్టి వేస్తుందని ఆందోళన చెందారు.
ఆ బృందంలో ఒకడు శంకరాచార్యులవారిని అంతం చేయాలనే ఉద్దేశంతో, ఆయన తపస్సు చేసుకుంటోన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ కాపాలికుడు కొంతదూరంలో ఉండగానే వాడు మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని తన దగ్గరికి వస్తున్నాడనే విషయం శంకరుల వారికి తెలిసిపోయింది. కాపాలికుడు ఆయన దగ్గరికి వచ్చి .. తాను బొందితో కైలాసానికి వెళ్లాలని అనుకుంటున్నాననీ, ఆయనని 'బలి' ఇవ్వడం వలన తన చిరకాలవాంఛ నెరవేరుతుందని చెప్పాడు. తన కోసం 'బలి' కావడానికి అంగీకరించమని కోరాడు.
అందుకు శంకరులవారు ఎంత మాత్రం సందేహించకుండా వచ్చిన పనిని పూర్తి చేయమంటూ ధ్యానంలోకి వెళ్లాడు. అంతే ఆ కాపాలికుడు ఆనందంతో పొంగిపోతూ శంకరుల వారి శిరస్సును ఖండించడానికి సిద్ధపడ్డాడు. దూరంగా పాతాళ గంగలో స్నానం చేస్తోన్న పద్మపాదుడి మనసు కీడు శంకించింది. తన గురువుకి ఏదో ఆపద కలుగుతోందనే విషయాన్ని మనసు హెచ్చరిస్తోంది. అయితే ఇద్దరి మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో తన ఇష్టదైవమైన నృసింహ స్వామిని ప్రార్ధించాడు పద్మపాదుడు.
అంతే తన శిష్యుడి మనవిని మన్నించడం కోసం నృసింహస్వామి పద్మపాదుడిని ఆవహించాడు. దాంతో ఒక్కసారిగా పద్మపాదుడికి సింహం లక్షణాలు రావడంతో అదే వేగంతో తన గురువు దగ్గరికి చేరుకున్నాడు. శంకరులవారి తల నరకబోతోన్న కాపాలకుడిపై దూకి తన పదునైన గోళ్లతో వాడి శరీరాన్ని చీల్చి వేశాడు. ఈ దృశ్యం చూసిన మిగతా శిష్యులు బిత్తరపోయారు. ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన శంకరుల వారు, ముక్కలై పడివున్న కాపాలకుడి మృతదేహాన్ని చూశాడు. పద్మపాదుడి శరీరంలో గల నృసింహస్వామిని ఆయన దర్శించి శాంతింపజేశాడు.