అరుదైన దివ్య క్షేత్రం
భారతీయుల ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతోన్న పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు, చాలా చోట్ల చోళ రాజుల పేరు వినిపిస్తూ వుంటుంది. అంతగా చోళులు ఆధ్యాత్మికత విషయంలో శ్రద్ధ కనబరిచారు. వైష్ణవ సంబంధమైన ... శైవ సంబంధమైన ఎన్నో ఆలయాలను నిర్మించారు. మరెన్నో ఆలయాలను పునరుద్ధరించారు. తమ తరువాత ఎలాంటి పాలకులు వచ్చినా ఆలయాల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా భారీగా ఏర్పాట్లు చేశారు.
ఆలయాల నిర్వహణకు పెద్దమొత్తంలో మాన్యాలను రాసివ్వడంలో తమ విశాల హృదయాలను ఆవిష్కరించారు. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు శాసనాలు ఈ విషయాలను స్పష్టం చేస్తుంటాయి. అలా వారి ఏలుబడిలో నిర్మించబడిన అరుదైన ఆలయం ప్రకాశం జిల్లా 'ఉప్పుటూరు'లో దర్శనమిస్తుంది. సాధారణంగా చోళ రాజుల క్షేత్రాలు ... శివ కేశవ క్షేత్రాలుగా దర్శనమిస్తుంటాయి.
ఈ నేపథ్యంలో ఇక్కడ వేంకటేశ్వర స్వామి ... శివుడు కొలువై కనిపిస్తుంటారు. అయితే వేంకటేశ్వరస్వామితో పాటు ఇక్కడ చెన్నకేశవ స్వామిని కూడా ప్రతిష్ఠించడం విశేషంగా చెబుతుంటారు. సువిశాలమైన ప్రదేశంలో ... ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం ఆనాటి వైభవానికి అద్దం పడుతూ వుంటుంది. చోళుల తరువాత వచ్చిన ఎంతో మంది రాజులు ఇక్కడి ఆలయాలను దర్శించినట్టుగా ఆధారాలు వున్నాయి.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో అటు వైష్ణవ పర్వదినాల్లోను ... ఇటు శైవ పుణ్య తిథుల్లోను ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తమ కష్టనష్టాలను హరిహరులకు చెప్పుకుని వారి అనుగ్రహాన్ని ఆశిస్తుంటారు ... కానుకలు - మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఇక్కడి దైవాలను దర్శించడం వలన విజయాలు ... సంపదలు ... మోక్షం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.