సిరులనిచ్చే లక్ష్మీ దర్శనం
శ్రీమహాలక్ష్మి ఎక్కడ వుంటే శ్రీనివాసుడు అక్కడ వుంటాడు. అలాగే పార్వతీదేవి ఎక్కడ వుంటే పరమశివుడు అక్కడ వుంటాడు. పురాణపరమైన అనేక గాధలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా లక్ష్మీదేవి ఆవిర్భవించిన క్షేత్రం ... ఆమె కోసం శ్రీనివాసుడు వెలసిన క్షేత్రం మనకి కర్ణాటక ప్రాంతానికి చెందిన 'కల్లూరు'లో దర్శనమిస్తుంది.
ఈ ప్రాంతానికి చెందిన భక్తుడు ప్రతియేటా కొల్హాపురిలోని లక్ష్మీదేవిని దర్శించుకునే వాడట. అలా చాలాకాలం గడిచిపోయాక, వయసు పైబడటంతో అతను కొల్హాపురి వెళ్లలేకపోయాడు. ఇక అమ్మవారిని దర్శించే భాగ్యం తనకి లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మరుసటి రోజునే ఆయన తన ఇంట్లోని బండరాయిపై గంధం తీస్తుండగా ఆ రాయి లక్ష్మీదేవి రూపాన్ని సంతరించుకుంది.
అది అమ్మవారి మహిమగా భావించిన ఆ భక్తుడు దానికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అతని పొలంలో శ్రీనివాసుడి విగ్రహం బయటపడింది. తన జన్మ ధన్యమైందని భావించిన ఆ భక్తుడు అమ్మవారికి ... స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. ఈ రెండు ప్రతిమలు రెండు విధాలుగా ఆవిర్భవించినప్పటికీ, అవి ఒకే పరిమాణంలో వుండటం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. లక్ష్మీదేవి ... శ్రీనివాసుడు ఆలయంలోకి చేరిన తీరు మహిమాన్వితమై వున్న కారణంగా అనతికాలంలోనే ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఇక ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి కూడా స్వయంభువు కావడం మరో విశేషంగా చెప్పుకుంటారు. వందల సంవత్సరాల ఘన చరిత్రను కలిగిన ఈ ఆలయాన్ని దర్శించడానికి వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన సంపదలు కలుగుతాయనీ ... సౌభాగ్యం సుస్థిరమవుతుందని ... ఎలాంటి అరమరికలు లేకుండా దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.