దీవెనలిచ్చే సాయి
ఆపదలో ఆదుకునేవాడు ... కష్టాల్లో కన్నీళ్లు తుడిచేవాడు దేవుడని అంతా అనుకుంటూ వుంటారు. ఈ కారణంగానే శిరిడీ సాయినాథుడు దేవుడయ్యాడు ... అందరి హృదయాల్లోను కొలువై నిత్యనీరాజనాలు అందుకుంటున్నాడు. సాయినాథుడి అనుగ్రహం కారణంగా సమస్యల నుంచి బయటపడిన వాళ్లు ఎంతో మంది వున్నారు. వారి అనుభవాలే బాబాని మరికొందరికి దగ్గర చేశాయి. అలా ఏర్పడిన భక్త బృందాలు తమ ఊళ్లలో బాబా ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు.
ఫలితంగా ఈ రోజున గ్రామానికో సాయి ఆలయం ... కాలనీకో సాయి మందిరం దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ - బి.ఎన్.రెడ్డి నగర్ లోని సాయి ఆలయం ఈ నేపథ్యంలోనిదే. ఈ ప్రాంతానికి చెందిన భక్తుడికి కలలో సాయి కనిపించి తనకి ఆలయం నిర్మించమని చెప్పాడట. ఆ భక్తుడు స్థానికుల సహాయ సహకారాలతో తన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఫలితంగా ఈ రోజున అంతా దర్శించుకుంటోన్న ఆలయం రూపుదాల్చింది. పొందికగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలో బాబా విగ్రహం నయనమనోహరంగా కనిపిస్తుంది.
మనసారా బాబాకి నమస్కరిస్తోన్న భక్తులు ఆయన తమకి అభయము నిస్తున్నట్టుగా ... ఆశీస్సులు అందజేస్తున్నట్టుగా అనుభూతి చెందుతుంటారు. గురువారం మాత్రమే కాకుండా పతి రోజూ బాబాని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు ... పారాయణాలు ఇక్కడి ఆలయంలో కనిపిస్తూ వుంటాయి. పండుగ రోజుల్లో భక్తుల సందడి మరింత ఎక్కువగా వుంటుంది.
మానసికపరమైన ఆందోళన నుంచి బయటపడటం కోసమే తన భక్తులు తనని ఆశ్రయిస్తారని బాబాకి తెలుసు. ఈ కారణంగానే ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనసు తేలికపడుతుంటుంది. ఇక్కడి సాయిని పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుందని చెబుతారు. అందుకే భక్తులు తాము తలపెట్టే కార్యక్రమాలను ముందుగా బాబాకి మనసులోనే చెప్పుకుంటూ వుంటారు. బాబా దీవెనలతో విజయాలు సాధిస్తూ ఆనందకరమైన జీవితాన్ని పొందుతుంటారు.