పిలిస్తే పలుకుతాడట!
భారతీయుల ఆధ్యాత్మిక జీవితం ఎంతో పవిత్రమైనది ... మరెంతో విశిష్టమైనది. భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ... ఆయనని దర్శించడానికి ... ఆయనకి మరింత చేరువకావడానికి అంతా తమ శక్తిమేరా ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం పూర్వీకులు చెప్పిన నవవిధ భక్తి మార్గాలను అనుసరిస్తుంటారు. సాధారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల జీవిత చరిత్రలను చదువుతున్నప్పుడు వాళ్లు దైవాన్ని చూసినట్టు ... మాట్లాడినట్టు వుంటుంది.
అలాంటి స్థితి తమకి వస్తుందా? అని సందేహంలో పడేవాళ్లు కొందరైతే, రావాలని పట్టుదలతో ప్రయత్నించే వాళ్లు మరికొందరు. ఈ నేపథ్యంలో అసలు దేవుడనేవాడు ఉన్నాడా ? అనే ప్రశ్న చాలామందిలో ఉదయిస్తూ వుంటుంది. ఉన్నాడు కాబట్టేగదా తన భక్తులను ఆపదల నుంచి రక్షిస్తున్నాడు అనే సమాధానం కూడా వారే చెప్పుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షేత్రంలోనైనా ఫలానా మహిమ జరిగిందంటే దానిని నమ్మేవాళ్లు చాలా తక్కువ. మనకళ్ల ముంగిట జరగలేదు కదా? అని వాదించే వారే ఎక్కువ.
ఇలాంటి సంఘటన ఒకటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 'తుంబూరు' లో జరిగిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఇక్కడి ప్రాచీన క్షేత్రంలో చెన్నకేశవస్వామి కొలువుదీరి వుంటాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం కోటలో ఆవిర్భవించిన ఈ దేవుడు, నిస్వార్ధపరులైన నిజభక్తులు పిలిస్తే వెంటనే ''ఓయ్'' ... అంటూ సమాధానం ఇచ్చేవాడని చెబుతారు. మహిమాన్వితమైన ఈ విషయం తెలిసే ఇక్కడి దేవుడిని శ్రీకృష్ణదేవరాయలు దర్శించాడని అంటారు.
ఇప్పుడు స్వామి పలకడం లేదు కాబట్టి ఇదంతా కట్టుకథని కొట్టిపారేసేవాళ్లు ఎంతమంది వుంటారో, ఆ స్థాయి పరిపక్వత ... భక్తి శ్రద్ధలు ఈ కాలంలో లేవని గత చరిత్రను వెనకేసుకువచ్చే వాళ్లూ అంతమందే వుంటారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి తొండమాన్ చక్రవర్తితో తరచూ మాట్లాడుతూ ఉండేవాడనీ, హథీరాం బావాజీతో పాచికలు ఆడేవాడని స్థలపురాణం చెబుతుంది. అబ్బురపరిచే ఆ సంఘటనలను నమ్మిన వాళ్లు ... తప్పనిసరిగా తుంబూరు దేవుడి పట్ల కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.