గురుసేవా ఫలితం
గాణుగాపురంలో బాలప్ప అనే నృసింహ సరస్వతి భక్తుడు ఉండేవాడు. అనునిత్యం ఆయన నృసింహ సరస్వతిని ఆరాధిస్తూ ఉండేవాడు. కొన్ని ఇళ్ల నుంచి మాత్రమే భిక్షను స్వీకరిస్తూ,అందులో కొంతభాగాన్ని మూగజీవాలకు ... జలచరాలకు అర్పించి మిగతాది తాను తీసుకునేవాడు. అలా కొంతకాలం గడిచాక, స్వామి ఆదేశం మేరకు ఆయన అక్కల్ కోట స్వామి సన్నిధికి చేరుకున్నాడు.
ఎవరూ ఎలాంటి పరిచయాలు చేయకుండానే అక్కల్ కోట స్వామి ఆయనని ఆదరించి, ఇకపై తనదగ్గరే వుండిపోమ్మని చెప్పాడు. అందుకు బాలప్ప ఆనందంగా అంగీకరించాడు. నాటి నుంచి ఆయన స్వామిని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటూ అన్ని రకాల పనులను ఎంతో ఓపికతో చేసుకు వెళుతూ ఉండేవాడు. తనపై అతనికి గల విశ్వాసం స్వామికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేది.
తన నుంచి ఎందరో ఎన్నో ఆశిస్తూ వుండగా, అలాంటి ఆలోచనే లేకుండా పనిచేసుకుపోతుండే బాలప్పను స్వామి ఎప్పుడూ పరిశీలిస్తూ మురిసిపోతూ ఉండేవాడు. ఒక్కోసారి బాలప్పను పరీక్షించడానికి స్వామి కొన్ని పరీక్షలు పెడితే, ఎలాంటి సందేహాలకి తావీయకుండా ఆయన ఆ పరీక్షల్లో మంచిమార్కులు తెచ్చుకునేవాడు. ఈ కారణంగానే స్వామి తన చివరి దశలో నోట్లోనుంచి తీసిన 'ఆత్మపాదుకలు' బాలప్పకి ఇచ్చాడు.
మహిమాన్వితమైనవిగా చెప్పబడే ఈ పాదుకలు బాలప్ప జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. గురుసేవకు ఫలితంగా ... ఆయన అనుగ్రహానికి సాక్ష్యంగా నేటికీ ఈ పాదుకలు బాలప్ప మఠంలో దర్శనమిస్తూ వుంటాయి ... దర్శించుకున్న వారికి సకల శుభాలను చేకూరుస్తూ వుంటాయి.