దత్తజయంతి విశిష్టత
దేవతలకు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు అత్రి మహర్షి తన తపోబలంతో వారికి సాయపడతాడు. ఆయన సహధర్మచారిణి అయిన అనసూయాదేవి, పాపభారాన్ని మోయలేకపోతోన్న నదులకు, తన పాతివ్రత్య మహిమచే తిరిగి పవిత్రతను ప్రసాదిస్తుంది. అలాంటి పుణ్య దంపతులను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు, ఆ దంపతుల అభీష్టం మేరకు 'మార్గశిర శుక్ల చతుర్దశి' రోజున వారి బిడ్డగా జన్మిస్తారు. ఒకే దేహంతో త్రిమూర్తులు తమని తాము అత్రికి దత్తత చేసుకున్న కారణంగా ఆ శిశువుకి 'దత్తాత్రేయుడు' అని అత్రి దంపతులు నామకరణం చేస్తారు.
మూడు తలలు ... ఆరుచేతులు గల ఆ శిశువు నుదుటపై ఊర్ధ్వ పుండ్రంతోను, మెడలోను ... జబ్బలకి ... ముంజేతులకి రుద్రాక్షలు ధరిస్తాడు. శంఖు చక్రాలు ... త్రిశూల ఢమరుకలు ... కమండలం జపమాల ధరించి మహా తేజస్సుతో వెలిగిపోసాగాడు. అలాంటి దత్తాత్రేయస్వామికి అవతార పరిసమాప్తి లేదు. యుగయుగాలుగా ఆయన వుంటూనే ఉంటాడు ... తన అవతారకార్యమైన జ్ఞాన .. యోగ విద్యలను భోదిస్తూ వుంటాడు. దత్తాత్రేయుడు వేదపురుషుడు అనే విషయాన్ని తెలియజెపుతూ నాలుగు వేదాలకు సంకేతంగా ఆయన పాదాల చెంత నాలుగు కుక్కలు కనిపిస్తుంటాయి.
దత్తాత్రేయుడి ఆదేశం మేరకు ఆయన భక్తులను అనుగ్రహించడానికి పక్కనే కామధేనువు వుంటుంది. ఏడుమార్లు స్మరించినంత మాత్రానే వెంటనే అనుగ్రహించే దత్తాత్రేయుడు, మేడిచెట్టు నీడలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాడు. మానవాళికి జ్ఞానామృతాన్ని అందించే కార్యక్రమాన్ని ఆయన అవధూతల రూపంలో కొనసాగిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో శ్రీపాద శ్రీవల్లభులు ... శ్రీ నృసింహ సరస్వతి ... మాణిక్య ప్రభు మహారాజ్ ... అక్కల్ కోట మహారాజ్ ... శిరిడీ సాయిబాబా ఆయన అవతారాలుగా చెప్పబడ్డారు.
విశ్వగురువుగా ఉపనిషత్తులచే చెప్పబడుతోన్న దత్తాత్రేయుడు, ఆధ్యాత్మిక సాధనకు మూలమైన జ్ఞానము .. యోగ విద్యలను అందిస్తూ వస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ రూపంలో పరీక్షిస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గితే, వాళ్ల జీవితం ధన్యమైనట్టే. బ్రహ్మకు మంత్ర విద్యను .. వశిష్ఠుడికి యోగవిద్యను ... ప్రహ్లాదుడికి ఆత్మవిద్యను ... పరశురాముడికి శ్రీ విద్యా మంత్రాన్ని దత్తాత్రేయుడు ఉపదేశించాడు. అంతే కాకుండా యదుమహారాజుకి ... హనుమంతుడికి ... సుబ్రహ్మణ్యుడికి ఆయన జ్ఞానభోద చేశాడు.
బలహీనుడైన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయస్వామి అనుగ్రహంతోనే వేయి చేతులను పొంది మహా పరాక్రమవంతుడు అనిపించుకున్నాడు. ఇలా ఎంతో మంది మహర్షులకు ... మహారాజులకు ... సామాన్యులకు వారు కోరిన దానిని బట్టి జ్ఞానం, ఆరోగ్యం, ఆయుష్షు, సంతానం , సౌభాగ్యం , సంపదలు , మోక్షం అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఆయన మార్గశిర శుక్ల చతుర్దశి రోజున జన్మించినప్పటికీ, 'మార్గశిర పౌర్ణమి' రోజున ఆయన జయంతిని జరుపుకోవడం దత్త సంప్రదాయంగా వస్తోంది.
అత్యంత విశిష్టమైన ఈ రోజున దత్త పీఠాలను దర్శించడం ... అక్కడి పాదుకలకు నమస్కరించడం ... మేడిచెట్టుకి ప్రదక్షిణలు చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. గురుపరంపరలో గల అవధూతలు కొలువైన ఆలయాలను దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయి. ఈ రోజున దత్తాత్రేయ స్వామి ప్రతిమకు షోడశోపచార పూజ చేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన, 'గురుగీత'... 'గురుచరిత్ర' పారాయణం చేయడం వలన సమస్త కోరికలు సిద్ధిస్తాయి.