ఆవేదనలు తీర్చు ఆలయం
శ్రీ శిరిడీ సాయిబాబా జీవితాన్ని పరిశీలిస్తే, పిడికెడు కష్టాలను కూడా పిసికి వడబోసి తన భక్తులకు భారాన్ని తగ్గిస్తూ వస్తోన్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఫకీరుగా మశీదు ఒడిలో తలదాచుకున్న బాబా, తన భక్తులకు ఆపద కలిగితే తల్లిలా తల్లడిల్లిపోయేవాడు. వారికి ఉపశమనం కలగడం కోసం ఆ బాధను తాను స్వీకరించేవాడు. బాబాలోని ఈ ఔదార్యమే ఆయనని భక్తులకు మరింత చేరువ చేసింది.
ఈ కారణంగానే నేడు ప్రపంచ వ్యాప్తంగా బాబా మందిరాలు భూలోక నక్షత్రాలుగా ఆవిర్భావిస్తూ వస్తున్నాయి. విజయవాడ - బెంజి సర్కిల్ దగ్గరలో కొలువుదీరిన సాయి ఆలయం కూడా ఈ నేపథ్యంలో నిర్మితమైనదే. భారీ నిర్మాణంగా రూపుదిద్దుకున్న బాబా ఆలయాల జాబితాలో ఇది ముందు వరుసలో కనిపిస్తుంది. ఆలయ ప్రాకారాలు ... ముఖమంటపం ... ప్రధాన వేదికపై గల విమానం అందమైన నగిషీలతో అబ్బురపరుస్తుంటాయి.
రథం ఆకారాన్ని పోలిన వేదికపై బాబా ప్రశాంత వదనంతో కూర్చుని వుంటాడు. ఏ వైపు నుంచి బాబాను చూసినా అయన తమ వైపే చూస్తున్న అనుభూతి భక్తులకు కలుగుతుంటుంది. శిరిడీలో మాదిరిగానే బాబాకి అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు ... ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక గురువారాల్లో జరిగే పల్లకీసేవ ... పవళింపు సేవ చూసి తీరవలసిందే.
సందడిగా ... సంబరంగా ఇక్కడ జరిగే ప్రతి సేవలోను భక్తులు ఉత్సాహంగా పాల్గొని తరిస్తుంటారు. ఇక్కడి బాబాను దర్శించుకున్న వారికి ఇబ్బందులు తొలగి పోతాయనీ, ఆవేదనలు మటుమాయమై మానసిక ప్రశాంతత కలిగిన జీవితం లభిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. సకలదేవతా స్వరూపమైన సాయిని నిరంతరం పూజిస్తూ పునీతులవుతుంటారు.