భార్య వల్లనే భర్త విజయం
రావణుడు - మేఘనాథుడు కలిసి లంకానగరంలో సాధుజనులను బంధిస్తారు. హరినామ స్మరణం మానుకోమంటూ చిత్రవధ చేయసాగారు. ఈ ఘోరాన్ని అడ్డుకోబోయిన సులోచనను కారాగారంలో బంధిస్తారు. దాంతో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఆమెకి తెలియకుండా పోతుంది. సాధు జనులను రక్షించమంటూ వారి తరఫున సులోచన శ్రీమహా విష్ణువును ప్రార్ధిస్తుంది.
అదే సమయంలో వానర సైన్యంతో రామలక్ష్మణులు లంకానగరంపై విరుచుకుపడతారు. రావణ సైన్యానికి ... వానర సైన్యానికి మధ్య భీకరమైన పోరు జరుగుతూ వుంటుంది. యుద్ధం గురించి తెలుసుకున్న సులోచన తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడితో యుద్ధం మంచిది కాదనీ, హరిని ఎదిరించి నిలిచిన వారు లేరని మేఘనాథుడికి సమాచారం పంపుతుంది.
మేఘనాథుడు ఆమె మాటలు పట్టించుకోకుండా యుద్ధరంగంలోకి అడుగుపెడతాడు. శ్రీ రాముడికి కుడి భుజం వంటి లక్ష్మణుడిని అంతం చేయడం వలన, విజయాన్ని సాధించవచ్చని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే లక్ష్మణుడితో యుద్ధానికి తలపడతాడు. ధర్మ యుద్ధం గురించి మాత్రమే తెలిసిన లక్ష్మణుడు, మేఘనాథుడి మాయా యుద్ధాన్ని కూడా సమర్థ వంతంగా ఎదుర్కుంటూ వుంటాడు.
అలాంటి పరిస్థితుల్లోనే తన పాతివ్రత్య మహాత్మ్యం కారణంగా కారాగారం నుంచి తప్పించుకున్న సులోచన యుద్ధభూమికి చేరుకుంటుంది. తన భర్త క్షేమాన్ని కోరుతూ శ్రీమహావిష్ణువును ప్రార్ధిస్తుంది. ఫలితంగా లక్ష్మణుడి పరాక్రమం బలహీనపడి, మేఘనాథుడు విజయం సాధిస్తాడు. భర్త పట్ల భార్యకి గల నిజమైన ప్రేమానురాగాలు అతణ్ణి ఓ కవచంలా కాపాడుతూ ఉంటాయని సులోచన మరోమారు నిరూపిస్తుంది. అయితే తన భార్య పాతివ్రత్య మహిమే తనని కాపాడిందని తెలియని మేఘనాథుడు, రెట్టించిన ఉత్సాహంతో రామదండును ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు.