ఆనందనిలయ విమానంలో శ్రీవారు ప్రయాణిస్తారా ?
వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడుగా ఆవిర్భవించాడు. కలి ప్రభావం నుంచి తన భక్తులను కాపాడటానికి కలియుగ దైవంగా శ్రీ వేంకటేశ్వరుడు ఆవిర్భవించిన పవిత్రమైన ప్రదేశమే తిరుమల. ఆదిశేషుని పడగలుగా చెప్పబడుతోన్న ఏడుకొండలపై స్వామికి తొండమాన్ చక్రవర్తి ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడి గర్భాలయానికి ఆనందనిలయమని పేరు.
సమస్త ప్రాణులు ఇక్కడి నుంచే అభయాన్ని ... ఆనందాన్ని పొందుతుంటాయి గనుక దీనిని ఈ పేరుతో పిలుస్తుంటారు. ఈ ఆనందనిలయం పైభాగాన గల గోపురాన్ని 'విమానం' అంటూ వుంటారు. పూర్వం దేవతలు ... వారి నుంచి వరాలను పొందిన తపసంపన్నులు పుష్పక విమానాల ద్వారా ఆకాశ మార్గాన ప్రయాణాలు సాగించేవారు. అలాగే శ్రీనివాసుడుగా ఇక్కడ కొలువైన శ్రీ మహావిష్ణువు, వైకుంఠానికి ... తిరుమలకు ఈ విమానం ద్వారానే ప్రయాణం చేస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి.
అయితే గర్భాలయం పై ఓ నిర్మాణంగా మాత్రమే కనిపించే ఈ విమానం, మహాత్ములకు పుష్పక విమానంగా గోచరిస్తూ ఉంటుందట. అలాంటి ఈ విమానం బంగారు పూతతో ధగధగలాడుతూ తిరుమలకు కొత్త శోభను తెస్తుంటుంది. క్రీ.శ.8 వ శతాబ్దం ప్రథమార్థంలో తొలిసారిగా పల్లవ రాజులు ఆనందనిలయ విమానానికి బంగారు రేకును సమర్పించారట.
ఆ తరువాత విజయనగర ప్రభువైన నరసింగదేవరాయలు ... సాళువ మంగిదేవ మహారాజు ... శ్రీ కృష్ణదేవరాయలు ... వైష్ణవ భక్తుడైన తాతాచార్యులు ... మహంతు ప్రయోగదాస్ ... టీటీడి ఆనందనిలయ విమానానికి బంగారు పూత పూయడం చేస్తూ వచ్చారు. ఈ బంగారు విమానం స్వామివారి వైభవానికి చిహ్నంగానే కాదు, మహనీయుల మహాభక్తికి కూడా ప్రతీకగా ... ప్రకాశవంతమై వెలుగొందుతూ వుంటుంది.