పార్వతీ రామలింగేశ్వరుడు
మంచుకొండలే మహాశివుడి నివాసం ... మంచువంటి ఆయన మనసే భక్తుల కోరికలు నెరవేర్చు అక్షయపాత్ర. అందుకే సదాశివుడు ఎక్కడ వుంటే అక్కడికి సకుటుంబ సపరివార సమేతంగా ఆయన భక్తులు చేరుతుంటారు ... కనులారా దర్శించి మనసారా తరిస్తుంటారు. అమ్మకన్నా తొందరగా కరిగిపోయే మనసున్న మహాదేవుడు, తన భక్తులను ఇబ్బందిపెట్ట కూడదనే ఉద్దేశంతో ఇష్టమైన చోటల్లా ఆవిర్భవించి ఇలవేల్పుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
అలా ఆయన కొలువుదీరిన చారిత్రక ఆలయం మనకి నల్గొండ జిల్లా గరిడేపల్లిలో దర్శనమిస్తుంది. ప్రధాన రహదారికి దగ్గరగా వుండటం వలన అభివృద్ధి చెందిన గరిడేపల్లికి ఇటు రామాలయం ... అటు శివాలయం రెండు కళ్లుగా విరాజిల్లుతుంటాయి. ఈ గ్రామానికి మధ్యలో సీతారామాలయం దర్శనమిస్తూ వుంటుంది. గుడిలోనే కాకుండా, ప్రధాన ద్వారానికి ఎదురుగా కొంత దూరంలో ప్రత్యేక మంటపంలో హనుమంతుడు కొలువుదీరి కనిపిస్తుంటాడు.
ఈ హనుమంతుడి ఆలయానికి దగ్గరలోనే ఓ పదిహేను సంవత్సరాల క్రితం శివాలయం బయటపడింది. కాకతీయుల కాలంనాటి భారీ శివలింగం భూమిలోనే సగభాగం కూరుకునిపోయి కనిపిస్తూ వుంటుంది. ఇక ఇదే ప్రదేశంలో బయటపడిన మరో శివలింగానికి ఇక్కడ పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఒకప్పుడు ఈ ఆలయం వైభవంతో వెలుగొందినట్టు ఆధారాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో పౌరోహిత్యాన్ని నిర్వహించే కృష్ణారావు అనే బ్రాహ్మణుడు ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.
పార్వతీ రామలింగేశ్వరుడుగా స్వామి పూజలు అందుకుంటోన్న ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేకపూజలు జరుపుతుంటారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించి తరించే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఇక మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తుంటారు. కులమత భేదాలు లేకుండా గర్భాలయంలోని స్వామివారిని ప్రతి ఒక్కరూ స్పర్శించి స్వయంగా అభిషేకించే అవకాశం వుండటం ఇక్కడి విశేషంగా చెబుతారు.
పార్వతీ రామలింగేశ్వరుడు మహా మహిమాన్వితుడనీ, స్వామిని అంకిత భావంతో ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్థానికులు చెబుతుంటారు. ఇక ఇక్కడి రాముడు కూడా శివయ్యతో పోటీపడి భక్తులను అనుగ్రహిస్తుంటాడు. శివుడు ... శివాంశ సంభూతుడైన హనుమంతుడు ... ఆయన సేవలను అందుకున్న శ్రీరామచంద్రుడు నెలకొని వుండటం ఈ ఊరు చేసుకున్న అదృష్టంగా స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు.