శుభాలనిచ్చే నాంచారమ్మ
గ్రామదేవతను ఇలవేల్పుగా భావించడం ... గౌరవించడం ... పూజించడం ప్రాచీనకాలం నుంచి వస్తోంది. సాధారణంగా గ్రామదేవతల ఆలయాలు గ్రామం ముంగిట గానీ ... మధ్యలోగాని కొలువై కనిపిస్తుంటాయి. గ్రామదేవత ఆశీస్సుల కారణంగానే తామంతా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నామని అక్కడి ప్రజలు పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి అంశగానే భావించి గ్రామదేవతలను ఆరాధించడం జరుగుతూ వుంటుంది. అలా అమ్మవారు 'నాంచారమ్మ' పేరుతో పూజలందుకుంటోన్న క్షేత్రం కృష్ణా జిల్లా విశ్వనాథపల్లిలో దర్శనమిస్తుంది. అవనిగడ్డ సమీపంలో గల ఈ గ్రామంలో అమ్మవారి ఆలయం అలరారుతోంది. ఇక ఇక్కడ అమ్మవారు ఆవిర్భవించిన తీరు కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది.
పూర్వం ఈ ప్రాంతంలో కరవుకాటకాలు ఏర్పడినప్పుడు, పశువులు కూడా ఆకలితో అలమటించసాగాయి. దాంతో అద్దంకి ప్రాంతంలో వాటిని మేపుకురావడానికి పశువుల కాపరులు బయలుదేరారు. వాటిని మేపుతూ అక్కడే వున్న పశువుల కాపరులు కొంతకాలం తరువాత తిరిగొచ్చారు. అయితే ఆ రోజు నుంచే గ్రామంలో పశువులు అంతు తెలియని వ్యాధి బారిన పడసాగాయి. దాంతో విషయం అర్థంకాక గ్రామస్తులు అయోమయానికి లోనయ్యారు.
అలాంటి పరిస్థితుల్లోనే ఓ భక్తుడికి కలలో అమ్మవారు కనిపించి, తాను అద్దంకి నుంచి పశువులతో కలిసి వచ్చిన నాంచారమ్మనని చెప్పిందట. తన ప్రతిమ ఫలానా చోట ఉన్నట్టుగా చెప్పి , అక్కడే దానికి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అమ్మవారి ఆదేశం ప్రకారమే నడచుకున్నారు. అద్దంకి నాంచారమ్మ పేరుతోనే అమ్మవారిని పూజించడం ప్రారంభించారు.
దాంతో పశువులు వ్యాధి బారి నుంచి బయటపడ్డాయి. అంతే కాకుండా మునుపెన్నడూ లేనంతగా పంటలు బాగా పండాయి. అమ్మవారు అనుగ్రహం కారణంగానే తమ ఊరికి మంచిజరుగుతోందని భక్తులు సంతోషించారు. ఆమెనే తమ ఇలవేల్పుగా భావించి పూజిస్తున్నారు. అమ్మవారి దయ వలన వ్యాధులు ... బాధలు తొలగిపోతాయనీ, సకల శుభాలు కలుగుతాయని వాళ్లంతా విశ్వసిస్తుంటారు. అమ్మవారు తమని కరుణించి వచ్చిన రోజుని పురస్కరించుకుని ప్రతి యేటా ఫాల్గుణ మాసంలో జాతర నిర్వహిస్తుంటారు ... కానుకలు - నైవేద్యాలు సమర్పించుకుంటూ వుంటారు.