కోరికలు నెరవేర్చే కోవెల
బ్రహ్మ ... విష్ణు ... మహేశ్వరుల శక్తి స్వరూపమే శ్రీసత్యనారాయణస్వామి. ఆ స్వామిని పూజించడం వలన త్రిమూర్తులను ప్రత్యక్షంగా ఆరాధించిన ఫలితం దక్కుతుంది. సత్యం చూపించే దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఈ స్వామి, ఎవరి నుంచైనా భక్తి శ్రద్ధలను ... నియమనిష్టలను కోరుకుంటాడు. ఈ స్వామిని అంకితభావంతో సేవిస్తే వరాలను ఎలా అనుగ్రహిస్తాడో, నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపిస్తే అంతేలా ఆగ్రహిస్తాడు.
అందుకే ఆయనంటే అందరికీ భయభక్తులు ఉంటాయనేది వాస్తవం. అలాంటి సత్యనారాయణస్వామికి ఆలయాలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటికి గల విశిష్టత అంత ఇంతా కాదు. ఈ జాబితాలో మెదక్ జిల్లా సిద్ధిపేటలో గల సత్యనారాయణస్వామి ఆలయం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
చాలాకాలం క్రితమే నిర్మించబడిన ఈ ఆలయంలో చలువరాయితో రూపొందించిన మూలమూర్తిగా స్వామి సమ్మోహనకరంగా దర్శనమిస్తూ వుంటాడు. ప్రశాంతమైన మోముతో ... సౌందర్యంతో కూడిన తేజస్సుతో వెలుగొందుతూ వుంటాడు. ఇక గర్భాలయం చుట్టూ అమర్చిన దశావతార శిల్పాలు నేత్రానందాన్ని కలిగిస్తుంటాయి. ఆలయ ముఖమంటపాన్ని అద్దాలతో కూడిన నగిషీలతో తీర్చిదిద్దారు. రకరకాల అద్దాలు ... అవి ఆవిష్కరించే వర్ణాలు ఆలయ శోభను రెట్టింపు చేస్తుంటాయి.
పర్వదినాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. కార్తీక మాసంలోను ... ధనుర్మాసంలోను ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక సాధారణ రోజుల్లోనూ ఇక్కడ సత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ఈ స్వామిని దర్శించడం వలన ... సేవించడం వలన అనేక ఇబ్బందులు అవలీలగా తొలగిపోవడమే కాకుండా, సకల శుభాలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.