సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత
సుబ్రహ్మణ్యస్వామి అనగానే నెమలి వాహనంతో శక్తి ఆయుధాన్నిధరించి, మెడ మీదుగా భుజాలపై నుంచి వేలాడే పూలమాలతో దర్శనమిచ్చే ధర్మ స్వరూపం గుర్తుకు వస్తుంది. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడిగానే కాదు, అసురుల గుండెల్లో గుబులు పుట్టించిన వీరుడిగా కూడా ఆయనకి పేరుంది. లోక కల్యాణార్థం అసురులను సంహరించడానికే సుబ్రహ్మణ్య స్వామి జన్మించడం జరిగింది.
మార్గశిర శుద్ధ షష్ఠి రోజునే ఆయన జన్మించాడు ... ఈ కారణంగానే ఈ రోజుని సుబ్రహ్మణ్య షష్ఠి గా పిలుస్తుంటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో దీనిని సుబ్బారాయుడి షష్ఠి అని కూడా అంటూ వుంటారు. తారకాసురుడిని వధించడానికి సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగానే ఆయనకి కుమార స్వామి ... కార్తికేయుడు ... షణ్ముఖుడు ... శరవణుడు ... స్కందుడు వంటి వివిధ నామాలు ఏర్పడ్డాయి.
ఈ కారణంగానే ఈ పర్వదినం కుమారషష్ఠిగా ... స్కంద షష్ఠిగా ... కార్తికేయ షష్ఠిగా పిలవబడుతోంది. లోక కల్యాణం కోసమే స్వామి అవతరించాడు కనుక, అందుకు కృతజ్ఞతగా స్వామిని ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. స్వామిని పంచామృతాలతో అభిషేకించి, వివిధ పుష్పాలతో అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామిని షోడశోపచారలతో పూజించి, ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
ఈ విధంగా స్వామిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందనీ ... అనారోగ్యాలు తొలగిపోతాయని ... విజయాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అనేక దోషాలు నశించి పోతాయనీ, పాపాలు పరిహరించబడతాయని స్పష్టం చేస్తున్నాయి.అందుకే ఈ పర్వదినాన ఆ స్వామిని శక్తి కొద్దీ పూజించాలి ... భక్తి కొద్దీ సేవించాలి.