పాడిపంటలనిచ్చే క్షేత్రం
శ్రీకృష్ణుడు గోపాలుడుగా ఆబాలగోపాలాన్ని అలరించాడు. ఆయనకి గోవులంటే ప్రాణం ... అందుకే వాటి సంరక్షణ బాధ్యతను నిర్వహించాడు. వాటి ఆహారానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వర్షాలు కురిపించాడు ... పంటలు పండించాడు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాటికి ఆపద కలిగినప్పుడు రక్షించాడు. కష్టాలు తొలగించే వాడే కృష్ణుడు కనుక అంతా ఆయనని అమితంగా ఆరాధిస్తూ వుంటారు.
ఈ నేపథ్యంలోనే కృష్ణుడి ఆలయాలు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాయి ... ఆయనపై భక్తులకు గల ప్రేమకు ఆనవాళ్లుగా అలరారుతున్నాయి. అలాంటి ఆలయాలలో చారిత్రక పరమైనవి మరింత విశిష్టతను సంతరించుకుని విలసిల్లుతున్నాయి. గుంటూరు జిల్లా 'యనమదల' గ్రామంలో కొలువైన వేణుగోపాలస్వామి ఆలయం ఈ కోవలోనిదే.
కాకతీయ ప్రభువైన గణపతి దేవుని కూతురు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. నాటి నుంచి స్వామివారికి నిత్య ధూప .. దీప .. నైవేద్యాలు నిర్వహించ బడుతున్నాయి. గర్భాలయంలో స్వామి సమ్మోహన సౌందర్యం చూసితీరవలసిందే. జీవం తొణికిసలాడుతూ తేజస్సు ఉట్టిపడుతూ వుంటుంది. స్థానికులు ఈ స్వామిని ఇలవేల్పుగా భావించి పూజిస్తూ వుంటారు. వేణుగోపాలుడి అనుగ్రహం కారణంగానే తమ గ్రామంలో పాడిపంటలు వృద్ధి చెందుతున్నాయని విశ్వసిస్తుంటారు.
తొలిపంటలో కొంత భాగాన్ని స్వామివారికి సమర్పించిన తరువాతనే మిగతాది వాళ్లు వినియోగిస్తారు. తమ ఆవు పాలతో ఆయనకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని వండి పెడుతుంటారు. విశేషమైన పుణ్య తిథుల్లో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో గ్రామస్తులంతా పాల్గొని వేణుగోపాలుడి ఆశీస్సులు పొందుతుంటారు.