ఒకనాటి తిరుమల
కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని కనులముంగిట ఆవిష్కరిస్తోన్న తిరుమల ఒకప్పుడు హథీరాం బావాజీ మఠం వారి అధీనంలో వుండేది. ఈ రోజున లక్షల మంది భక్తులతో సందడిగా కనిపిస్తోన్న తిరుమలకి అప్పట్లో వందల సంఖ్యలో మాత్రమే భక్తులు వస్తూ వుండేవాళ్లు. మఠానికి సంబంధించిన వారు తప్ప అర్చకులు సైతం చీకటి పడగానే కొండ దిగిపోయే వాళ్లు.
తిరుమల కొండకి భక్తులు ఎక్కువగా రాకపోవడానికి గల కారణం, వచ్చిన వారికి వసతి సౌకర్యాలు లేకపోవడం ... చీకటి పడగానే జంతువుల భయం ఎక్కువగా ఉండటమని అప్పటి మహంతు ప్రయాగ దాస్ గుర్తించాడు. భక్తులకు వసతి - భద్రత కల్పించాలని భావించాడు. తిరుమల కొండపై ఒక ఊరును ఏర్పాటు చేయడమే ఇందుకు పరిష్కారంగా భావించి, అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేశాడు.
కొండపై ఉపాధి చూపిస్తామని చెప్పడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు కుటుంబాలతో సహా ఉండటానికి సిద్ధపడ్డారు. స్వామివారి ఆలయానికి సంబంధించి ... మఠానికి సంబంధించిన పనుల్లో కుదరడం, వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం వలన వారి జీవితం సాగిపోయేది. అనతికాలంలోనే కొండకి భక్తులుగా వచ్చే వారి సంఖ్య పెరుగుతూ రావడంతో, కొండపై నివాసముండే కుటుంబాల సంఖ్య వందల్లోకి చేరుకుంది.
మన దేవుడు .. మనకొండ .. మన ఊరు అనే ఉద్దేశంతో ఇక్కడి వాళ్లంతా కూడా ఆలయ అభివృద్ధి పనుల్లో పాల్పంచుకున్నారు. స్వామి అనుగ్రహం వలన ... అక్కడి వారి కృషి వలన అనతి కాలంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఈలోగా అక్కడ నివాసముండే కుటుంబాల సంఖ్య వేలల్లోకి చేరుకున్నాయి. దాంతో భక్తుల రద్దీని తట్టుకోవడం కోసం, నివాసిత కుటుంబాలను కొండ కిందకి తరలించక తప్పలేదు.