ధనుర్మాసం విశిష్టత
ధనుర్మాసం అనే పేరు ఎంత పవిత్రంగా అనిపిస్తుందో ... ఈ మాసమంతా కూడా అదే పవిత్రత కనిపిస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడు 'మృగశిర' నక్షత్రంలో వుండటం వలన మార్గశిర మాసమని అంటారు. ఈ మాసంలోనే సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ధనూ రాశిలోకి ప్రవేశించడం వలన దీనిని ధనుస్సంక్రమణమని అంటారు. ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు, మకర రాశిలోకి ప్రవేశించేంత వరకూ గల కాలాన్ని ధనుర్మాసమని అంటారు.
చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసంగా ... సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నంత వరకూ సూర్యమానం ప్రకారం ధనుర్మాసంగా పిలవబడుతోంది. శ్రీమహావిష్ణువును ఆరాధించడానికి ... ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ధనుర్మాసం విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ కారణంగానే వైష్ణవ ఆలయాలు ఈ మాసంలో భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల నుంచి మారుమూల గ్రామంలో గల వైష్ణవ ఆలయాల వరకూ తన పవిత్రతతో ధనుర్మాసం ప్రభావితం చేస్తుంది.
ఉదయాన్నే చలిలో భగవంతుడి నామస్మరణ చేస్తూ చేసే స్నానం ... వేకువ జామునే వెలిగిపోతూ కనిపించే స్వామి దర్శనం ... గుడి మైకులో తియ్యగా మోగే 'తిరుప్పావై' ... ప్రసాదంగా మిరియాలు దట్టించిన దధ్యోదనం ... ధనుర్మాసాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా మలుస్తాయి ... ఒక సరికొత్త శోభను తీసుకువస్తాయి. ఈ మాసమంతా కూడా సూర్యోదయానికి ముందే వాకిట్లో ముగ్గులువేసి గొబ్బెమ్మలు పెడుతుంటారు. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు ... గోదాదేవి సమేత రంగనాథ స్వామిని పూజిస్తుంటారు.
ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి రంగనాథస్వామిని తన పాశురాల ద్వారా అర్చించింది. తమ మధురభక్తితో సాక్షాత్తు రంగనాయకస్వామి మనసు గెలుచుకుని 'భోగి' రోజున వివాహం చేసుకుంది. ఈ కారణంగానే ఈ రోజున అన్ని వైష్ణవ సంబంధ ఆలయాల్లో గోదాదేవి - రంగనాయక స్వామివార్ల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి సమేత రంగనాథస్వామిని దర్శించడం వలన ... వారి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.