ఆదుకునే ఆంజనేయుడు

ఆదుకునే ఆంజనేయుడు
హనుమంతుడు శివాంశ సంభూతుడనీ, హనుమంతుడిని ఆరాధించడం వలన సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివాంశ సంభూతుడు కావడం వలన, శ్రీమన్నారాయణుడి సేవలో తరించడం వలన హనుమంతుడిని ఆరాధిస్తే శివకేశవుల అనుగ్రహం కూడా ఉంటుందని అంటారు. ఈ కారణంగానే హనుమంతుడికి సంబంధించిన వివిధ క్షేత్రాలు భక్తులతో ఎప్పుడూ సందడిగా కనిపిస్తూ వుంటాయి.

అడుగడుగునా అనుగ్రహించే ఆంజనేయుడికి భక్తులు ఆకుపూజలు - అభిషేకాలు జరుపుతుంటారు ... ఇష్టమైన వడ మాలలు సమర్పిస్తూ వుంటారు. అలా అనునిత్యం భక్తులచే పూజాభిషేకాలు అందుకునే స్వామి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో దర్శనమిస్తుంటాడు. ఇక్కడి స్వామికి ప్రతి మంగళవారం ప్రదక్షిణలు చేయడం వలన, మండలదీక్షలు తీసుకోవడం వలన భక్తుల మనోభీష్టాలు నెరవేరుతుంటాయి.

అడిగినదే తడవుగా ఇక్కడి స్వామి ఆరోగ్యాన్ని ... ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. హనుమజ్జయంతి వేడుకలను ఇక్కడ ఘనంగా జరుపుతుంటారు. ఇదే ప్రాంగణంలో మహాశివుడు మహా తేజస్సుతో వెలిగిపోతుంటాడు. శివుడిని ... శివాంశ సంభూతుడైన హనుమంతుడిని ఒకేచోట దర్శించుకోవడాన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తుంటారు ... అనునిత్యం వారిని పూజిస్తూ పునీతులవుతుంటారు.

More Bhakti Articles