జతింగ రామేశ్వరుడు
ఆధ్యాత్మిక వైభవం ... చారిత్రక నేపథ్యం గల క్షేత్రాలు అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంటాయి. ప్రాచీన కాలానికి చెందిన ప్రజలకి గల భక్తి శ్రద్ధలు, ఆనాటి సామాజిక పరిస్థితులను ఈ క్షేత్రాలు ప్రతిబింబిస్తూ వుంటాయి. అడుగుపెట్టడంతోనే ఈ క్షేత్రాలు చారిత్రక పరంగా ... ఆధ్యాత్మికత పరంగా ఆనాటి కాలానికి తీసుకువెళుతుంటాయి.
సాధారణంగా వివిధ క్షేత్రాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు, రాజుల ప్రమేయం కారణంగా చారిత్రకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అయితే 'చిత్రదుర్గ' విషయంలో మాత్రం ఇటు ఆధ్యాత్మికత ... అటు చారిత్రకత సమపాళ్లలో దర్శనమిస్తూ వుంటాయి. కర్ణాటకా ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో శివుడు 'జతింగ రామేశ్వరుడు' గా కొలవబడుతుంటాడు.
పూర్వం సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. రావణాసురుడిని ఎదిరించి ప్రాణాలు విడిచిన జటాయువుకు రాముడు అంత్యక్రియలు నిర్వహించాడు. అందుకు గుర్తుగానే ఆయన ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడ శివుడిని జతింగ రామేశ్వరుడని పిలుస్తుంటారు. ఈ ప్రాంతాన్ని ఏలిన ఎంతోమంది రాజులు ... మంత్రులు ... సామంతులు ఈ స్వామిని దర్శించిన ఆధారాలు వున్నాయి.
ఇక మహాభారత కాలంలో భీముడు ... హిడింబాసురుడితో పోరాడిందీ, హిడింబిని వివాహమాడింది ఇక్కడేనని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ 'హిడింబేశ్వరాలయం' దర్శనమిస్తూ వుంటుంది. ఇక అనేక మంది రాజులు ... వారి సాహస గాధలకు చిత్రదుర్గం సజీవ సాక్ష్యంగా కనిపిస్తూ వుంటుంది. అందువలన ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మికతను ... ఆసక్తికరమైన చరిత్రను సమపాళ్లలో రంగరించి అందించే ఈ ప్రదేశాన్ని దర్శించడం మరిచిపోలేని అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.